Home
Mobile

ముకేష్ అంబానీ అదిరిపోయే ఆఫర్.. ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. చవక ధరకే సొంతం చేసుకోండి..!

iPhone 14: ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. అపర కుబేరుడు పారిశ్రామిక దిగ్గజం ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ డిజిటల్ ఈ-కామర్ సంస్థ ఐఫోన్ 14పై అదిరిపోయే డిస్కౌంట్ ప్రకటించింది. 2022లో విడుదలైన ఈ యాపిల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్, ఇప్పుడు భారీ తగ్గింపుతో కేవలం రూ.48,000కే లభిస్తోంది. దీని అసలు ధర రూ.54,900కాగా, నేరుగా రూ.6,500 తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫరే కాదు బ్యాంక్, క్రెడిట్ కార్డ్ ఆఫర్లతో ఈ ధరను మరింత తగ్గించుకోవచ్చు.

ఈ డిస్కౌంట్లతో, ఐఫోన్ 14 ధర ఏకంగా రూ.47,400కు పడిపోతుంది. ఒకవేళ మీ దగ్గర HSBC క్రెడిట్ కార్డ్ ఉంటే, మరో 5% డిస్కౌంట్ (గరిష్టంగా రూ.2,000 వరకు) అందుకోవచ్చు. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 46,400కే సొంతం చేసుకోవచ్చు. అంటే, అసలు ధరతో పోలిస్తే మీరు ఏకంగా రూ.8,500 ఆదా చేసుకోవచ్చు అన్నమాట.

Mukesh Ambani   s Big Offer  Massive iPhone 14 Discount  Get It for Just Rs

* ఐఫోన్ 14 ఫీచర్లు

యాపిల్ సంస్థ ఐఫోన్ 14ని 2022 అక్టోబర్‌లో రూ.79,900 ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో, ముఖ్యంగా సేల్స్ సమయంలో ఇది హాట్ కేకుల్లా అమ్ముడుపోయింది. ఈ ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్‌ప్లేతో వస్తుంది, ఇది స్పష్టమైన, ప్రకాశవంతమైన విజువల్స్‌ను అందిస్తుంది.

ఫాస్ట్ పర్ఫామెన్స్ కోసం ఇందులో యాపిల్ A15 బయోనిక్ చిప్‌సెట్ ఇచ్చారు. ల్యాగ్ లేకుండా ఎలాంటి పెద్ద గేమ్ అయినా ఆడుకోవచ్చు. కెమెరా లవర్స్ కోసం, వెనుకవైపు 12MP డ్యూయల్-కెమెరా సెటప్ ఉంటుంది, ఇందులో వైడ్-యాంగిల్ ప్రైమరీ లెన్స్, అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఇది 5x డిజిటల్ జూమ్, 2x ఆప్టికల్ జూమ్‌కు మద్దతు ఇస్తుంది.

రెటీనా ఫ్లాష్‌తో కూడిన 12MP ఫ్రంట్ కెమెరా హై-క్వాలిటీ సెల్ఫీలను అందిస్తుంది. ముందు, వెనుక కెమెరాలు రెండూ 24fps వద్ద 4K వీడియోలను రికార్డ్ చేయగలవు. ఇందులో 3279mAh బ్యాటరీ అందించారు, ఇది 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది కాబట్టి త్వరగా మొబైల్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు.

ఇది 5G నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ సిమ్ (నానో సిమ్ + eSIM) సపోర్ట్‌తో వస్తుంది. 128GB, 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అయితే, స్టోరేజ్ ను పెంచుకునే అవకాశం లేదు. ఈ ఫోన్‌కి వాటర్, డస్ట్ రెసిస్టెంట్ సర్టిఫికెట్ ఉంది, అంటే నీరు, దుమ్ము నుంచి పూర్తి రక్షణ ఉంటుంది.

* ఐఫోన్ 16 – లేటెస్ట్ యాపిల్ ఫ్లాగ్‌షిప్

యాపిల్ సంస్థ ఐఫోన్ 16 సిరీస్‌ను గత సంవత్సరం సెప్టెంబర్‌లో విడుదల చేసింది. ఇది సెప్టెంబర్ 20న భారతదేశంలో అమ్మకానికి వచ్చింది. మొదటి రోజునే భారీ అమ్మకాలు జరిగాయి. బేస్ మోడల్ ధర రూ.79,900 నుంచి ప్రారంభమవుతుంది, అయితే హై-ఎండ్ ఐఫోన్ 16 ప్రో ధర రూ.144,900.

ఐఫోన్ 16 సిరీస్ యాపిల్ A18 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది, ఇది మునుపటి మోడళ్ల కంటే వేగవంతమైన పనితీరు, మెరుగైన బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది. మీరు లేటెస్ట్ యాపిల్ ఫ్లాగ్‌షిప్ కోసం చూస్తుంటే, ఐఫోన్ 16 ఒక ఆప్షన్, కానీ ముకేష్ అంబానీ ఆఫర్‌తో, ఐఫోన్ 14 బడ్జెట్-ఫ్రెండ్లీ కొనుగోలుదారులకు ఒక అద్భుతమైన డీల్ అని చెప్పవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Digital offers a massive discount on iPhone 14, bringing the price down, further reducible with bank offers. Compared to iPhone 16, iPhone 14 is a great deal for budget-conscious buyers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X