పోయిన ఫోన్‌ని గూగుల్ సాయంతో సాధించింది, ఎలాగో తెలుసా ?
ఎవరైనా స్మార్ట్‌ఫోన్ పోతే ఏం చేస్తారు. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం, సిమ్ కార్డును బ్లాక్ చేయడం లాంటివి చేస్తుంటారు.
ఎవరైనా స్మార్ట్‌ఫోన్ పోతే ఏం చేస్తారు. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం, సిమ్ కార్డును బ్లాక్ చేయడం లాంటివి చేస్తుంటారు. ఆ తరువాత దాని గురించి కొద్ది రోజులు ఎంక్వయిరీ ఇక పోయిన వస్తువు రాదులే అని ఆశలు వదిలేసుకుంటాం. అయితే ముంబైకి చెందిన జీనత్ బాను హక్(19) మాత్రం అలా వదిలేయలేదు. కేవలం గూగుల్ సాయంతో అతన్ని వెంటాడి, వేటాడి పట్టుకుంది. కేవలం గూగుల్ సాయంతోనే ఈ పని చేసింది. పూర్తి వివరాల్లోకెళితే..

మరోల్ ప్రాంతంలోని ప్రీస్కూల్ లో ..
ముంబైలోని ఆంధేరిలో గల మరోల్ ప్రాంతంలోని ప్రీస్కూల్ లో జీనత్ పనిచేస్తోంది. అయితే ఆదివారం మలద్ ట్రిప్ నుంచి ఇంటికి వచ్చి చూసుకోగా తన రెడ్ మీ 4ఏ ఫోన్ కన్పించలేదు.

గూగుల్ అకౌంట్ ద్వారా
దీంతో వెంటనే తన గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అయిన జీనత్.. పోగొట్టుకున్న ఫోన్ లో లొకేషన్ ను యాక్టివేట్ చేసింది.

అవతలి వ్యక్తి మొబైల్ లో
దీంతో అవతలి వ్యక్తి మొబైల్ లో ఏమేం చేస్తున్నాడు? ఏయే వీడియోలు చూస్తున్నాడు? వంటి సమస్త సమాచారం జీనత్ కు చేరేది.

మరో ఆండ్రాయిడ్ ఫోన్ సాయంతో
దీంతో ఆమె మరో ఆండ్రాయిడ్ ఫోన్ సాయంతో తస్కరించిన ఫోన్ పై నిఘా పెట్టింది. వేరే ఫోన్లూ గూగుల్ అకౌంట్ లాగిన్ అయి అన్నీ వివరాలను తన కంట్రోల్ లోకి తెచ్చుకుంది.

పీఎన్ఆర్ నంబర్ ను స్క్రీన్ షాట్
తొలుత కాలా సినిమాలో పాటలను సెర్చ్ చేసిన నిందితుడు.. ఆ తర్వాత వాట్సప్ ను అప్ డేట్ చేశాడు. సెల్ఫీ కూడా తీసుకున్నాడు. చివరికి దాదర్ నుంచి తిరువణ్ణమలైకి రైల్వే టికెట్ బుక్ చేశాడు. అనంతరం దాని పీఎన్ఆర్ నంబర్ ను స్క్రీన్ షాట్ తీసుకున్నాడు.

జీనత్ అతని ఫొటోతో పాటు పీఎన్ఆర్ నంబర్ తో ..
దీన్ని గమనించిన జీనత్ అతని ఫొటోతో పాటు పీఎన్ఆర్ నంబర్ తో రైల్వే పోలీసుల్ని ఆశ్రయించింది. చివరికి సోమవారం రైలు బోగీలో ఎక్కిన సెల్వరాజ్ శెట్టి(32)ని రైల్వే అధికారులు దాదర్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పోయిన ఫోన్‌ను వెతికిపట్టుకునేందకు చిట్కాలు!
ఐఎమ్ఈఐ నెంబర్:
ప్రతి మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు ఐఎమ్ఈఐ నెంబర్ తప్పనిసరిగా కేటాయించటం జరుగుతుంది. ‘*#06#'కు డయిల్ చేయటం ద్వారా 15 అంకెలతో కూడిన మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబరును తెలుసుకోవచ్చు. భవిష్యత ఉపయోగం కోసం ఈ నెంబరును భద్రపరుచటం మంచిది. ఫోన్ వెనుక భాగంలో అంటే బ్యాటరీ క్రింది ప్రదేశంలో ఈ నెంబర్‌ను మీరు చూడవచ్చు. ఫోన్ అపహరణకు గురైన సమయంలో పోలీసులను ఆశ్రయించాల్సి వస్తే తప్పనిసరిగా సదరు మొబైల్ ఐఎమ్ఈఐ నెంబర్‌ను ఎఫ్ఐఆర్ పత్రంలో పొందుపరచాల్సి ఉంటుంది. మొబైల్‌ను కనుగొనటంలో ఐఎమ్ఈఐ నెంబర్ కీలక పాత్ర పోషిస్తుంది.

పోయిన ఫోన్‌లో డేటాను చేరిపేయటం ఏలా..?
టిప్ - 1
రిమోట్ విధానం ద్వారా మీ ఫోన్‌లోని డేటాను డిలీట్ చేయదలచినట్లయితే ముందుగానే మీ ఫోన్‌లో Android Device Manager feature ఎనేబుల్ చేసి ఉంచుకోండి. మీ ఫోన్‌లో ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయాలంటే Google Settings >> Security >> Android Device Manager. Now look for 'allow remote lock and erase and switch it on.

ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ యాప్ లేదా ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్
వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవటం ద్వారా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను రిమోట్ విధానంలో లోకేట్ చేయవచ్చు. డివైస్ లోకేషన్‌ను మ్యాప్‌లో చూడొచ్చు. (గమనిక: ఫోన్ ఆన్ చేసిన ఉంటేనే దాని లోకేషన్‌ను మీరు ట్రేస్ చేయగలరు).

రింగ్ ఆప్షన్‌ను
ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ ద్వారా మీ డివైస్‌ను ట్రేస్ చేసిన తరువాత మూడు ఆప్షన్‌లు కనిపిస్తాయి. అందులో ఒకటి రింగ్, మరొకటి లాక్ అండ్ ఎరేజ్. రింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా మీ డివైస్ ఫుల్ వాల్యుమ్‌తో 5 నిమిషాల పాటు బెగ్గరగా రింగ్ అవుతుంది.

లాక్ ఆప్షన్
లాక్ ఆప్షన్‌ను ఎంపిక చేసేుకున్నట్లయితే రిమోట్ విధానం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను లాక్ చేసేయవచ్చు.

Erase ఆప్షన్
Erase ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే మీ ఫోన్‌లోని అన్ని సెట్టింగ్స్‌తో సహా మ్యూజిక్, ఫోటోస్, వీడియోస్, యాప్స్ ఇలా మొత్తం డేటా డిలీట్ అయిపోతుంది. ఎస్డీ కార్డ్‌లోని డేటా మాత్రం అలానే ఉంటుంది.


Click it and Unblock the Notifications








