మ్యూజిక్ యుద్దం మొదలైంది.. గెలిచేదెవరో..?

Posted By: Staff

మ్యూజిక్ యుద్దం మొదలైంది.. గెలిచేదెవరో..?

మొబైల్ రంగంలో మ్యూజిక్ కోసం ప్రత్యేకంగా మొబైల్ ఫోన్స్‌ని తయారు చేయడం ఇదేమి కొత్త కాదు. ఐతే క్వాలిటీ మొబైల్ హ్యాండ్ సెట్స్‌ని కస్టమర్స్‌కు అందించడం కోసం ఇప్పటికీ ప్రతి మొబైల్ తయారీదారులు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దేశీయ మొబైల్ దిగ్గజం కార్బన్ మొబైల్స్ మార్కెట్లోకి మ్యూజిక్‌ని అందించేందుకు కార్బన్ కె550ఐ బూమ్ బాక్స్ 2ని విడుదల చేయనుంది. డ్యూయల్ సిమ్ ఫీచర్‌ని కలిగి ఉండి కస్టమర్స్ యొక్క ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని హై క్వాలిటీ MP3 ప్లేయర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. MP3 ప్లేయర్‌తో పాటు మొబైల్‌లో ఎఫ్‌ఎమ్ రేడియో కూడా ఇంటిగ్రేడ్ చేయడం జరిగింది.

కార్బన్ కె550ఐలో ఎంటర్టెన్మెంట్‌తో పాటు గేమింగ్ అప్లికేషన్స్‌ని కూడా ఇమిడికృతం చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సిన ఫీచర్ ఏమిటంటే బూమ్ బాక్స్ 2 మ్యూజిక్ అప్లికేషన్. ఇదే కొవలోకి చెందిన మరో మ్యూజిక్ సిరిస్ మొబైల్ ఫోన్ వీడోయోకాన్ వి1635. ఐదే బాజూంబా సిరిస్‌కి మ్యూజిక్ చెందిన మ్యూజిక్ మొబైల్ ఫోన్. వీడోయోకాన్ వి1635 ప్రత్యేకత ఏమిటంటే PMPO మ్యూజిక్ అవుట్ పుట్‌ని సుపిరియర్ క్వాలిటీతో అందిస్తుంది. వీడోయోకాన్ వి1635 కూడా డ్యూయల్ సిమ్ ఫీచర్‌ని కలిగి ఉంది.

వీడోయోకాన్ వి1635 మొబైల్ 2.4 ఇంచ్ డిస్ ప్లేతో పాటు స్టయిలిష్ డిజైన్ దీని ప్రత్యేకత. 2మెగా ఫిక్సల్ కెమెరా ఉండడం వల్ల చక్కని ఇమేజిలతో పాటుగా, వీడియో రికార్డింగ్ ఫీచర్‌ని కలిగి ఉంది. బయట ఎప్పుడైనా స్పీకర్స్‌కి కనెక్టు చేసుకునేందుకు గాను 3.5 mm ఆడియో జాక్ కూడా మొబైల్‌తో లభిస్తుంది. అదే కార్బన్ కె550ఐ పోన్‌లో కూడా 2 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు, మొమొరీని 8జిబి వరకు విస్తరించుకునేందుకు గాను ఇందులో మైక్రో ఎస్‌డి స్లాట్ నిక్షిప్తం చేయబడింది.

రెండు మొబైల్స్ కూడా ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఇందులో ఓపెరా మిని బ్రౌజర్ ప్రత్యేకం. జిపిఆర్‌ఎస్, వ్యాప్ అప్లికేషన్‌ని కూడా కార్బన్ కె550ఐ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీలైన బ్లూటూత్, వై-పైలను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌ని కనెక్ట్ అయ్యేందుకు Snaptu అప్లికేన్ ప్రత్యేకంగా నిక్షిప్తం చేయబడింది. ఇన్న అత్యాధునిక ఫీచర్స్ ఉన్న కార్బన్ కె550ఐ మొబైల్ ధర సుమారుగా మార్కెట్లో రూ 2,990గా ఉంటుందని తెలిపారు. ఇది ఇలా ఉంటే వీడియో కాన్ వి1635 మొబైల్ ధరని ఇంకా మార్కెట్లో నిర్ణయించలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot