రూ 1,999కే ప్రపంచాన్ని చూడోచ్చు...

Posted By: Staff

రూ 1,999కే ప్రపంచాన్ని చూడోచ్చు...

ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎంతో అభివృద్దిని చెందినటువంటి ఎమ్‌విఎల్ గ్రూప్ అమ్ముల పొది నుండి కొత్తగా మొబైల్ హ్యాండ్ సెట్‌ని విడుదల చేయనుంది. ఆ మొబైల్ పేరు ఎమ్‌విఎల్ ఆర్6. ఎమ్‌విఎల్ ఆర్6 మొబైల్‌ యూజర్స్ కొసం కొత్త కొత్త ఫీచర్స్‌ని అందించడంతో పాటు తక్కవ ధరకే లభ్యమవుతుంది. ఎమ్‌విఎల్ ఆర్6 మొబైల్‌లో లభ్యమవుతున్న కొత్త ఫీచర్ స్నిఫ్ఫర్. స్నిఫ్ఫర్ అంటే ఏంటని అనుకుంటున్నారా అదోక మొబైల్ ట్రాకింగ్ ప్రోగ్రామ్. దీని ముఖ్య ఉపయోగం ఏమిటంటే మీరు అనుకొని సంఘటనలలో ఎప్పుడైనా మొబైల్‌ని పొగొట్టుకున్నట్లైతే దానిని ఈజీగా కొనుగొనడానికి ఈ స్నిఫ్పింగ్ ఉపయోగపడుతుంది.

ఇక ఎమ్‌విఎల్ ఆర్6 ఫీచర్స్ విషయానికి వస్తే 1.3 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉంది. మంచి చూడచక్కని పోటోలను తీసేందుకు గాను ఇందులో ఫ్లాష్ ఆఫ్షన్ కూడా ఉంది. జూమ్ ఫెసిలిటీతోటి వీడియో రికార్డింగ్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు ఎమ్‌విఎల్ ఆర్6 మొబైల్ MP3 మ్యూజిక్‌ని అందించడమే కాకుండా వైర్ లెస్ ఎఫ్ ఎమ్ రేడియోని రేడియో స్టేషన్స్ టైమింగ్స్ ప్రకారం అందిస్తుంది. కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్‌ని A2DP ద్వారా డేటాని ట్రాన్పర్ చేస్తుంది. ఈ బ్లూటూత్ వల్ల మ్యూజిక్, వీడియో ఫైల్స్‌ని చాలా వేగంగా ట్రాన్ఫర్ చేయవచ్చు.

మీకు ఇంకొక విషయం చెప్పాలి. చాలా తక్కవ ధరలో ప్రస్తుతం మార్కెట్లో ఇంటర్నెట్ ఫెసిలిటీని సపోర్ట్ చేసే మొబైల్స్ చాలా తక్కువ. కానీ ఎమ్‌విఎల్ ఆర్6 మాత్రం జిపిఆర్‌ఎస్ ద్వారా ఇంటర్నెట్ ఫెసిలిటీని కూడా అందిస్తుంది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మొమొరీ లభించగా మొమొరీని మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా 8 జిబీ వరకు ఎక్పాండ్ చేయవచ్చు. ఎమ్‌విఎల్ ఆర్6 మొబైల్‌లో మనం చర్చించుకోవాల్సిన మరో విషయం బ్యాటరీ బ్యాక్ అప్. ఎమ్‌విఎల్ ఆర్6 మొబైల్‌ని కంటిన్యూగా వాడినట్లైతే 650నిమిషాల పాటు బ్యాటరీ వస్తుంది. అదే స్టాండ్ బై టైమ్ 720 గంటలు. అంతేకాకుండా వీటిలో కరెన్సీ కన్వర్టర్, వరల్డ్ క్లాక్, క్యాలుక్లేటర్ అదనపు హాంగులు ప్రత్యేకం.

ఇన్ని రకాల ఫీచర్స్ ఉన్నటువంటి ఎమ్‌విఎల్ ఆర్6 ధర కూడా చాలా తక్కువ. ఎంతంటే కేవలం రూ 1,999 మాత్రమే. ఇన్ని అత్యాధునిక ఫీచర్స్ ఉన్న ఎమ్‌విఎల్ ఆర్6 మొబైల్ గ్యారంటీగా మద్యతరగతి కుటుంబాలకు నచ్చుతుందని భావిస్తున్నారు.

MVL R6 Features:

One year replacement warranty
1.3 MP Camera with Flash
Big & Clear color display
1500mAh 30 Days Battery Backup**
MP4/3GP Video Player, FM Radio with Recording
Expandable Memory upto 8GB
Bluetooth
WAP,MMS
Multiple Language (English, Hindi, Tamil, Telugu)
Auto Call Recording
Smart Divert
Mobile Tracker

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot