మైక్రోసాఫ్ట్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, లుమియా 640, 640 ఎక్స్ఎల్

Posted By:

బార్సిలోనా వేదికగా ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2015లో భాగంగా సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన లుమియా సిరీస్ నుంచి లుమియా 640, లుమియా 640 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌‍లను ప్రదర్శించింది. ఈ విండోస్ ఆధారిత ఫోన్‌లు సింగిల్ ఇంకా డ్యుయల్ సిమ్ వేరియంట్‌లలో లభ్యమవుతాయి.

 మైక్రోసాఫ్ట్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, లుమియా 640, 640 ఎక్స్ఎల్

లుమియా 640 ఎక్స్ఎల్ 5.7 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉంటే, లుమియా 640 ఐదు అంగుళాల తెరను కలిగి ఉంటుంది. ఈ కొత్త లుమియా స్మార్ట్‌ఫోన్‌ల పై ఏడాది పాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ఉచిత సబ్‌స్ర్కిప్షన్‌ను మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేస్తోంది.

 మైక్రోసాఫ్ట్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, లుమియా 640, 640 ఎక్స్ఎల్

5 అంగుళాల 720 పికల్స్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో రూపుదిద్దుకున్న లుమియా 640, ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో 8 మెగా పిక్సల్ రేర్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్ ముందు భాగంలో 1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేసారు. విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం అలానే 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ పై ఫోన్ రన్ అవుతుంది. 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 30జీబి ఉచిత వన్ డ్రైవ్ స్టోరేజ్‌ను మైక్రోసాఫ్ట్ ఈ ఫోన్ కొనుగోలు పై ఆఫర్ చేస్తోంది. లుమియా 640 ఫోన్ 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

లుమియా 640 ఎక్స్ఎల్ స్పెసిఫికేషన్‌ల విషయానికొస్తే.. 5.7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే (కార్నింగ్ గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో), 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌‍డ్రాగన్ 400 సీపీయూ, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం.

English summary
MWC 2015: Microsoft Announces Lumia 640 And Lumia 640 XL. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot