MWC 2018లో లాంచ్ అయిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

|

టెక్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్న MWC 2018లో టాప్ కంపెనీలు తమ ఫోన్లను ప్రదర్శనకు ఉంచిన విషయం అందరికీ తెలిసిందే. స్పెయిన్ లోని బార్సిలోనాలో జరుగుతున్న ఈ ఈవెంట్లో నోకియా , శాంసంగ్, ఎల్‌జి, సోనీ లాంటి కంపెనీలు తమ సరికొత్త ఫోన్లను రంగంలోకి దింపాయి. అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి దూసుకురానున్న ఈ ఫోన్ల ధరలను అలాగే ఫీచర్లను మీకందిస్తున్నాం. ఏ కంపెనీ ఫోన్ మిమ్మల్ని అమితంగా ఆకట్టుకుంటుందో మీరు ఓ సారి చెక్ చేసుకోవచ్చు. ఈ వివరాలన్నింటిపై ఓ స్మార్ట్ లుక్కేయండీ.

 

డిజిటల్ వాలెట్లకు షాకిచ్చిన RBI, రేపే ఆఖరి గడువు !డిజిటల్ వాలెట్లకు షాకిచ్చిన RBI, రేపే ఆఖరి గడువు !

Samsung Galaxy S9 and S9 Plus

Samsung Galaxy S9 and S9 Plus

గెలాక్సీ ఎస్‌ 9 ఫీచర్లు

5.8కర్వ్‌డ్‌ సూపర్‌ ఎమోలెడ్‌ డిస్‌ప్లే ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 1440 x 2960 పిక్సెల్స్‌రిజల్యూషన్‌ 4జీబీర్యామ్‌ 64జీబీస్టోరేజ్‌ 12ఎంపీ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్‌బ్యాటరీ,

గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ఫీచర్లు

6.2 డిస్‌ప్లే 1440x2960 రిజల్యూషన్‌ ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 6జీబీ ర్యామ్‌ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 64జీబీ స్టోరేజ్‌ 12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ఇండియా మార్కెట్లో రూ. 46 వేలు ఉంటుందని అంచనా. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ప్లస్ ధర రూ.54,400 ఉంటుందని అంచనా.అయితే కరెక్ట్ ధరలను ఇండియాలో జరగనున్న లాంచ్ ఈవెంట్లో కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది.

 

LG V30S with ThinQ
 

LG V30S with ThinQ

V30S ThinQ స్పెసిఫికేషన్స్...
6 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ప్లస్ ఓఎల్ఈడి ఫుల్ విజన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1440x 2880 పిక్సల్స్) విత్ 16:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, 6జీబి ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్స్ (128జీబి + 256జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2టీబీ వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్, బ్లుటూత్ 5.0 (బీఎల్ఈ), నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3300ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీ, ఫోన్ చుట్టుకొలత 151.7x75.4x7.3 మిల్లీ మీటర్లు, బరువు 158 గ్రాములు

Nokia 8110 4G

Nokia 8110 4G

నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్ ఫీచర్లు
2.4 ఇంచ్ క్యూవీజీఏ డిస్‌ప్లే, 320 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ స్నాప్‌డ్రాగన్ 205 ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, ఎక్స్‌పాండబుల్ మెమొరీ, డ్యుయల్ సిమ్, కాయ్ ఓఎస్, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), ఐపీ 52 డ్రిప్ ప్రొటెక్షన్, 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, యూఎస్‌బీ 2.0, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ధర విషయానికొస్తే నోకియా 8110పై క్లారిటీ లేదు. హెచ్‌ఎండీ గ్లోబల్‌ దీని ధరను 79 యూరోలుగా నిర్ణయించినప్పటికీ ఇండియాలో ఇది మరింతగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Nokia 8 Sirocco

Nokia 8 Sirocco

నోకియా 8 సిరొక్కో స్మార్ట్‌ఫోన్‌ వీటితో పాటుగా ఏప్రిల్‌ ప్రారంభం నుంచి సేల్‌ మొదలవుతోంది.
5.5 అంగుళాల క్యూహెచ్‌డీ పీఓలెడ్‌ డిస్‌ప్లే, 3డీ కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ 5, ఆక్టా-కోర్‌ క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ఎస్‌ఓసీ, 6జీబీ ర్యామ్‌, 128జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌, 12 ఎంపీ, 13 ఎంపీతో డ్యూయల్‌ రియర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా దీనిలో ఫీచర్లు. నోకియా 8 సిరొక్కో స్మార్ట్‌ఫోన్‌ ధర 749 యూరోలుగా కంపెనీ నిర్ణయించింది. అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.60వేలుగా తెలుస్తోంది. కానీ భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర ఎంత ఉండొచ్చో కంపెనీ వెల్లడించలేదు.

Nokia 6 and 7 Plus

Nokia 6 and 7 Plus

ఇక కొత్త నోకియా 6 ముందు దాని కంటే 60 శాతం వేగవంతంగా పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను 279 యూరోలకు కంపెనీ మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్‌ ఓరియో గో ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ అయిన నోకియా 1, మృదువుగా డిజైన్‌ అయింది. గూగుల్‌ ప్లే స్టోర్‌ ఫుల్‌ యాక్సస్‌తో దీన్ని ఆవిష్కరించింది. దీని ధర కూడా అన్ని పన్నులు, సబ్సిడీలు కలుపుకోకపోతే, 85 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది.

Nokia 1

Nokia 1

నోకియా 1 ఫీచర్లు లైట్ వెయిట్ వర్షన్లో వస్తున్న నోకియా 1ను బడ్జెట్ ధరకే మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు HMD Global సర్వం సిద్ధం చేసింది. ఈ ఫోన్లో అన్ని రకాల గూగుల్ యాప్స్ ఉండే అవకాశం ఉంది. కాగా నోకియా బ్రాండ్ లలో వచ్చిన ఫోన్ల అన్నింటింకంటే ఈ ఫోన్ బెస్ట్ వర్షన్ పోన్ గా నిలుస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీని ధరను కంపెనీ 85 అమెరికన్ డాలర్లకు (దాదాపుగా రూ.5,500) గా నిర్ణయించింది. వార్మ్ రెడ్, డార్క్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. అధికారికంగా ఈ ఫోన్ ఏప్రిల్ నెలలో వినియోగదారులకు లభ్యం కానుంది.
ఫీచర్లు ఇవే..
4.5 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్ ఓఎస్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2150 ఎంఏహెచ్ బ్యాటరీ.

 ZTE Blade V9 and V9 Vita

ZTE Blade V9 and V9 Vita

జడ్‌టీఈ బ్లేడ్ వీ9 ఫీచర్లు

ధర రూ.21,415.
5.7 ఇంచ్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.

జడ్‌టీఈ బ్లేడ్ వీ9 వీటా ఫీచర్లు
ధర రూ. 14,255

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డీటీఎస్ ఆడియో, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ZTE Tempo Go

ZTE Tempo Go

జడ్‌టీఈ టెంప్ గో ఫీచర్లు
ధర రూ.5177
5 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2200 ఎంఏహెచ్ బ్యాటరీ.

Sony Xperia XZ2 and XZ2 Compact

Sony Xperia XZ2 and XZ2 Compact

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్2 కాంపాక్ట్ ఫీచర్లు
ధర ఇంకా వెల్లడి కాలేదు
5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 19 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, యూఎస్‌బీ టైప్ సి, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 2870 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్2 ఫీచర్లు
ధర ఇంకా వెల్లడి కాలేదు
5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 19 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, యూఎస్‌బీ టైప్ సి, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3180 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
MWC 2018: All the phones and gadgets announced so far More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X