వావ్ అనిపించేలా హువాయ్ ఫోల్డబుల్ ఫోన్
స్మార్ట్‌ఫోన్ లవర్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హువాయ్ ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది.నిన్న జరిగిన MWC 2019లో ఈవెంట్ లో హువాయ్ సంస్థ దీనిని లాంచ్ చేసింది.
స్మార్ట్‌ఫోన్ లవర్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హువాయ్ ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది.నిన్న జరిగిన MWC 2019లో ఈవెంట్ లో హువాయ్ సంస్థ దీనిని లాంచ్ చేసింది.కాగా ఈ ఫోన్ ను Huawei Mate X 5G పేరుతో లాంచ్ చేసింది.ఈ ఫోన్ యొక్క సేల్స్ జూన్ లేదా జులై నెల నుంచి మొదలు కావచ్చు అని హువాయ్ సంస్ధ తెలిపింది. అయితే ఈ ఫోన్ ధర సుమారు రూ.2,09,400 అని తెలుస్తుంది.

ఫీచర్లు...
6.6 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లే, 2480 x 1148 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 6.38 ఇంచుల సెకండరీ ఓలెడ్ డిస్‌ప్లే, 2480 x 892 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హువాయ్ కైరిన్ 980 ప్రాసెసర్, 5జీ, 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఎన్ఎం కార్డ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 40, 16, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 55 వాట్ల సూపర్ చార్జ్.

డిస్‌ప్లే
ఈ ఫోన్ ముందు భాగంలో 6.6 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు అలాగే వెనుక భాగంలో 6.38 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ రెండింటినీ ఫోల్డ్ తీసినప్పుడు డిస్‌ప్లే ఒకటే అవుతుంది. అప్పుడు ఆ డిస్‌ప్లే సైజ్ 8 ఇంచుల వరకు వస్తుంది. ఇలా ఈ ఫోన్ ను ఫోల్డ్ చేసుకోవచ్చు.

40, 16, 8 మెగాపిక్సల్ కెమెరాలు
ఈ ఫోన్ వెనుక భాగంలో 40, 16, 8 మెగాపిక్సల్ కెమెరాలు మూడు ఉన్నాయి. అలాగే ఈ ఫోన్లో మైక్రో ఎస్డీ కార్డుకు బదులుగా ఎన్ఎం కార్డు స్లాట్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఆ స్లాట్‌లో ఎన్ఎం కార్డును వేసుకుని స్టోరేజీని పెంచుకోవచ్చు.ఈ ఫోన్‌లో 5జీ ఫీచర్‌ను అందించడం మరొక విశేషం.

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్
అలాగే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరంగా ఇది మంచి పనితీరును కనబరుస్తోంది.హువాయి కస్టమ్ అయిన quad-core processorతో పాటు Kirin 980తో ఈఫోన్ రాబోతుంది . ఇది వేగవంతమైన పనితీరును అందిచబోతుంది .ఈ స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్ 512 జీబీ స్టోరేజ్ తో లభ్యమవుతోంది.

55 వాట్ల సూపర్ చార్జ్ ఫీచర్
ప్రపంచంలో ఏ ఫోన్లో లేని 55 వాట్ల సూపర్ చార్జ్ ఫీచర్‌ను ఇందులో అందిస్తున్నారు . అలాగే బాటరీ విషయానికొస్తే ఇందులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








