మరో అతిచిన్న ఫోన్ రిలీజయ్యింది, ధర రూ.3940

మరో అతిచిన్న ఫోన్ మార్కెట్లో రిలీజ్ అయ్యింది. Elari NanoPhone C పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.3,940. Yerha.com అనే ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఈ ఫోన్‌లను విక్రయిస్తోంది. 30 గ్రాముల బరవుతో క్రెడిట్ కార్డ్ సైజులో కనిపించే ఈ ఫోన్ సిల్వర్, రోజ్ గోల్డ్ అలానే బ్లాక్ కలర్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

NanoPhone C స్పెసిఫికేషన్స్...

1 ఇంచ్ టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 128x96పిక్సల్స్), RTOS పై ఈ ఫోన్ రన్ అవుతుంది. మీడియాటెక్ MT6261D చిప్ సెట్, 32 ఎంబి ర్యామ్, 32ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 

మ్యాజిక్ వాయిస్ ఫంక్షన్ ద్వారా...

280mAh బ్యాటరీ (4 గంటల టాక్‌టైమ్, 4 రోజుల స్టాండ్‌బై టైమ్), ఎంపీ3 ప్లేయర్, వాయిస్ రికార్డర్, ఎఫ్ఎమ్ రేడియో, మైక్రో యూఎస్బీ పోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, బ్లూటూత్ కనెక్టువిటీ, ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన మ్యాజిక్ వాయిస్ ఫంక్షన్ ద్వారా మిత్రులకు ప్రాంక్ కాల్స్ చేసి వారిని ఆటపట్టించవచ్చు.

అతి చిన్న టచ్‌స్ర్కీన్ ఫోన్..

మీరు అనేక రకాలైన స్మార్ట్‌ఫోన్లను చూసి ఉంటారు. అవి సైజు కూడా మినిమం 4అంగుళాల నుంచి పైనే ఉంటాయి. 7 అంగుళాల వరకు ఈ ఫోన్లు మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే అంతకన్నా తక్కువ స్మార్ట్ ఫోన్ వస్తే ఎలా ఉంటుంది. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా..అవును ఇప్పుడు ప్రపంచంచలోనే అత్యంత చిన్న స్మార్ట్‌ఫోన్ వచ్చింది..ఫీచర్స్ కూడా దుమ్మురేపే విధంగా ఉన్నాయి.

డిస్‌ప్లే సైజు

మీరు చూస్తున్నఈ ఫోన్ డిస్‌ప్లే సైజు కేవలం 1.54 ఇంచులు మాత్రమే! అందుకే కాబోలు ప్రపంచంలోనే అతి చిన్న టచ్‌స్క్రీన్‌ ఫోన్‌గా రికార్డుల్లోకి ఎక్కింది.

పెద్ద స్మార్ట్‌ఫోన్లకు ఏ మాత్రం తీసుపోదు.

ఈ చిట్టి ఫోన్‌ పేరు ‘వీఫోన్‌ ఎస్‌8'. చైనాలోని ‘వీఫోన్‌' అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. అయితే పరిమాణంలో ఇది పొట్టిదైనా.. ఫీచర్ల విషయంలో మాత్రం పెద్ద స్మార్ట్‌ఫోన్లకు ఏ మాత్రం తీసుపోదు.

ఐఓఎస్‌.. ఆండ్రాయిడ్‌ వేరియంట్లలో

ఐఓఎస్‌.. ఆండ్రాయిడ్‌ వేరియంట్లలో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. ఇతర ఓఎస్‌లను సపోర్ట్‌ చేసే ఫోన్లనూ తీసుకురానున్నట్లు సంస్థ చెబుతోంది.

పవర్‌ బటన్‌

ఫీచర్ల విషయానికొస్తే దీనికి పవర్‌ బటన్‌ మాత్రమే ఉంది. దీంతో పాటు తెరపై మరో మూడు వర్చువల్‌ బటన్స్‌ ఉన్నాయి. మిగతా ఫోన్లలాగే స్పీకర్‌, మైక్రోఫోన్‌ కలిగి ఉంది.

హార్ట్‌ రేట్‌ సెన్సర్‌

ఈ ఫోన్‌లో బిల్ట్‌ఇన్‌ ఎఫ్‌ఎం రేడియో ఉంటుంది. అలాగే హార్ట్ రేట్ చూసేందుకు హార్ట్‌ రేట్‌ సెన్సర్‌ కూడా ఉంటుంది. ఇంకా అద్భుతమైన ఫీచర్ నడకను లెక్కించే పెడోమీటర్‌ కూడా ఇందులో ఉంటుంది.

64ఎంబి ర్యామ్‌

64ఎంబీ ర్యామ్‌ 128ఎంబీ ఇంటర్నల్‌ మెమొరీ(8జీబీ వరకు పెంచుకోవచ్చు) దీంతో పాటు 8జిబి టీ ఫ్లాష్ మెమొరీ ఉంటుంది. అయితే ఇది ఒక సిమ్ కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ విషయానికొస్తే

380యంఏహెచ్‌ బ్యాటరీతో వస్తోంది. ఫోన్ బరువు కేవలం 30 గ్రాములు మాత్రమే. ఈ ఫోన్ లో యూజర్స్ మెసేజ్ లు సోషల్ మీడియా యాప్స్ లాంటివన్నీ చూసుకోవచ్చు.

ఫోన్‌ ధర 30 డాలర్లు

ఈ ఫోన్‌ ధర 30 డాలర్లు(సుమారు రూ. 2000). ఇది ప్రస్తుతానికి చైనా మార్కెట్‌లోనే అందుబాటులో ఉంది. Bluetooth v4.0, 5 PIN USB, USB 2.0 ,హెడ్‌ఫోన్‌ జాక్‌ ,లైట్‌ సెన్సర్‌ అదనపు ఫీచర్లు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
NanoPhone C, world’s smallest phone launched in India at Rs.3,940. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot