నరేంద్ర మోడీ నేపధ్యంతో మార్కెట్లోకి రెండు స్మార్ట్‌నమో స్మార్ట్‌ఫోన్‌లు
నరేంద్ర మోడీని ఇతివృత్తంగా తీసుకుని గుజరాత్‌కు చెందిన ఓ కంపెనీ రెండు స్మార్ట్‌నమో (నమో అంటే నరేంద్రమోడీ అని అర్థం) ఫోన్‌లను ఆవిష్కరించింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నేపధ్యంతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌లు ‘స్మార్ట్‌నమో సాఫ్రన్ వన్', ‘స్మార్ట్‌నమో సాఫ్రన్ టూ' వేరియంట్‌లలో లభ్యం కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ప్రీ-బుకింగ్‌లను ప్రముఖ ఈ-కామర్స్ సైట్ స్నాప్‌డీల్ రూ.999 ముందస్తు చెల్లింపుతో స్వీకరిస్తోంది. బుక్ చేసుకున్న వారికి ఈ ఫోన్‌లను అక్టోబర్ రెండో వారం నుంచి అందుతాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
స్మార్ట్‌నమో సాఫ్రన్ వన్, 16 ఇంకా 32జీబి మెమరీ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. 16జీబి వేరియంట్ ధర రూ.18,000. 32జీబి మెమరీ వేరియంట్ ధర రూ.23,000. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... 5 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), 441 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3150ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్. బ్లాక్ ఇంకా వైట్ కలర్ ఆప్షన్స్, 2జీ, వై-ఫై, బ్లూటూత్, ఇంకా మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ.
ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌నమో సాఫ్రన్ టూ ధర రూ.24,000. 6.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), 338 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3150ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్, 32జీబి ఇంటర్నల్ మెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి వరకు విస్తరించుకునే అవకాశం. 2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ ఇంకా మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ. ఈ ఫోన్ కొనుగోలు పై అదనపు బ్యాటరీ, లెదర్ కేస్ ఇంకా రూ.1,111 విలువ చేసే ఫీచర్ హ్యాండ్ సెట్‌ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది.
ఈ రెండు ఫోన్‌లలో ముందుగానే నరేంద్రమోడీకి సంబంధించిన వాల్ పేపర్లు, వీడియోలు ఇంకా అప్లికేషన్‌లను ప్రీలోడ్ చేయటం జరిగింది. సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో నరేంద్రమోడీని ‘నమో'గా అభివర్ణించటం జరుగుతోంది.

Click it and Unblock the Notifications