భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తగ్గిన జోరు.. సామ్‌సంగ్ నెం.1
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాల వృద్థి గతేడాదితో పోలిస్తే బలహీనంగా ఉన్నాయని అంతర్జాతీయ రిసెర్ట్ సంస్థ ఐడీసీ పేర్కొంది. ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరించిన భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాల ఎదుగుదల గతేడాది మొదటి మూడు నెలల్లో మూడంకెల్లో ఉండగా, ఈ ఏడాది 84 శాతంగానే ఉందని ఐడీసీ వెల్లడించింది.

ఐడీసీ తెలిపిన వివరాల మేరకు ఈ ఏడాది ఏప్రిల్ - జూన్ నెలల్లో 6.321 కోట్ల సెల్‌ఫోన్‌లు విక్రయం అయ్యాయి. వీటిలో స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు 29 శాతం ఉన్నాయి. అంటే ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో 1.842 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌లో విక్రయమయ్యాయి. 2013 ఏప్రిల్ - జూన్ లో జరిగిన1,002 కోట్ల స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలతో పోల్చినపుడు ఈసారి 84శాతం వృద్థి లభించింది. కానీ గత ఏడాది తొలి త్రైమాసికంలో పోలిస్తే, ఈ ఏడాది జనవరి - మార్చి త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాల్లో లభించించిన 186 శాతం వృద్థితో పోల్చుకుంటే, రెండు త్రైమాసికంలో వృద్ధి తగ్గినట్లే.
భారత స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్లో 29 శాతం మార్కెట్ వాటాతో సామ్‌సంగ్ అగ్రస్థానంలో నిలిచిందని ఐడీసీ తెలిపింది. మైక్రోమాక్స్ - 18శాతం, కార్బన్ - 8 శాతం, లావా - 6 శాతంతో ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. మరిన్ని చవక ధర స్మార్ట్‌ఫోన్‌లను అందించాల్సిన అవసరం సామ్‌సంగ్‌కు ఉందని ఐడీసీ తన నివేదికలో పేర్కొంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








