ప్రపంచం పై కన్నేసింది!!

Posted By: Super

ప్రపంచం పై కన్నేసింది!!

 

మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ ఎన్ఈసీ (NEC).సమంజసమైన ధరలకే క్వాలిటీ ఉత్పత్త్తులను చేరువచేసే ఈ సంస్థ ప్రపంచ మార్కెట్ పై దృష్టి సారించింది. ఎన్ఈసీ మీడియాస్ 101ఎస్ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను బ్రాండ్ డిజైన్ చేసింది. ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసే ఈ డివైజ్ మెరుగైన పనితీరును ప్రదర్శిస్తుంది. యూజర్ వేగవంతమైన మొబైలింగ్‌ను ఆస్వాదించే విధంగా ఉన్నతస్థాయి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్‌ను హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేశారు.

ఫోన్ కీలక ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 2.3.5 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

512ఎంబీ ర్యామ్,

4 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్,

5 మెగా పిక్సల్ కెమెరా,

క్వాలిటీ ఆడియో ప్లేయర్,

క్వాలిటీ వీడియో ప్లేయర్,

వై-ఫై,

బ్లూటూత్,

జీపీఆర్ఎస్,

యూఎస్బీ కనెక్టువిటీ,

నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ),

ఎఫ్ఎమ్ రేడియో,

1230 mAh లితియమ్ ఐయాన్ బ్యాటరీ

ఏర్పాటు చేసిన 4 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ ఉత్తమ రిసల్యూషన్ పిక్సల్స్‌ను కలిగి కంటికి ఇంపైన కోణంలో విజువల్స్‌ను డిస్‌ప్లే చేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 5 మెగా పిక్సల్ కెమెరా హైక్వాలిటీ పోటోగ్రఫీకి సహకరిస్తుంది. కనెక్టువిటీ వ్యవస్థలైన వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీలు డేటాను వేగవంతంగా షేర్ చేస్తాయి. జీపీఆర్ఎస్ సపోర్ట్ ఉత్తమ బ్రౌజింగ్‌కు సహకరిస్తుంది. ఫోన్ ధర విడుదలకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot