Home
Mobile

మీ ఫోన్ ఉంచకూడని ప్రదేశాలు గురించి తెలుసుకోండి !

ఇప్పుడు అందరిచేతిలో ఖచ్చితంగా ఉండే పరికరం సెల్‌ఫోన్‌ ఒక్కటే. ఎక్కడికి వెళ్లినా మన చేతిలో ఈ ఫోన్ ఉండాల్సిందే.

ఇప్పుడు అందరిచేతిలో ఖచ్చితంగా ఉండే పరికరం సెల్‌ఫోన్‌ ఒక్కటే. ఎక్కడికి వెళ్లినా మన చేతిలో ఈ ఫోన్ ఉండాల్సిందే.అయితే కొన్ని ప్రదేశాల్లో మీరు మొబైల్ పెడితే చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ముఖ్యంగా నాలుగు చోట్ల ఫోన్‌ పెట్టుకుంటే ఆరోగ్యంగా నష్టపోతారని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా ప్రపంచంలో పడి మనం ఏం చేస్తున్నామో కూడా చాలామందికి తెలియడం లేదు. సమయానికి నిద్ర లేకుండా ఈ మాయా ప్రపంచంలో బతికేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారు బాగా అలసిపోయినప్పుడు ఫోన్ ఎక్కడో ఓ చోట పడేస్తుంటారు కూడా.. అయితే ఎక్కడ పడేసినా ఇలాంటి ప్రదేశాల్లో ఉంచవద్దని నిపుణులు చెబుతున్నారు.

ప్యాంట్‌ బ్యాక్‌ పాకెట్‌లో

ప్యాంట్‌ బ్యాక్‌ పాకెట్‌లో

ప్యాంట్‌ బ్యాక్‌ పాకెట్‌లో సెల్‌ఫోన్‌ని పెట్టుకోకూడదట. బ్యాక్‌ పాకెట్‌లో పెట్టుకోవడం వల్ల మనం ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఫోన్‌ ఒత్తిడికి గురై బ్యాటరీ ఉబ్బే ప్రమాదముందని చెప్తున్నారు. ఆ బ్యాటరీ ఉబ్బితే ఆ ఫోన్‌ పేలే అవకాశాలున్నాయట.

ఏసీలు, ఫ్రిజ్‌లు ఉన్న దగ్గరలో

ఏసీలు, ఫ్రిజ్‌లు ఉన్న దగ్గరలో

ఏసీలు, ఫ్రిజ్‌లు ఉన్న దగ్గరలో సెల్‌ఫోన్లు ఉంచకూడదట. ‘0' డిగ్రీస్‌ కంటే తక్కువ టెంపరేచర్‌లో సెల్‌ఫోన్‌ ఉంచడం వల్ల ఆ ఫోన్లో ఉన్న బ్యాటరీ సామర్ధ్యాన్ని కోల్పోతుందని పరిశోధకులు చెప్తున్నారు.

సెల్‌ఫోన్‌ని ఎండలో పెట్టి

సెల్‌ఫోన్‌ని ఎండలో పెట్టి

సెల్‌ఫోన్‌ని ఎండలో పెట్టి మర్చిపోవడం లాంటివి చెయ్యకూడదట. అలా ఎండలో పెట్టి మర్చిపోవడం వల్ల బ్యాటరీ వేడెక్కి అందులో ఉన్న ద్రవం బయటకొచ్చి ఫోన్‌ పాడైపోయే అవకాశాలున్నాయట.

వంట చేస్తూ ఫోన్‌

వంట చేస్తూ ఫోన్‌

ఇది ముఖ్యంగా ఆడవాళ్ల కోసం. కొంతమంది వంట చేస్తూ ఫోన్‌ మాట్లాడతారట. అలాంటి సమయంలో ప్రెజర్‌ కుక్కర్‌, స్టవ్‌కి దగ్గరలో ఫోన్‌ని ఉంచుతూ ఉంటారు. ఇది అన్నింటికంటే చాలా ప్రమాదమని పరిశోధకులు చాలా గట్టిగా చెప్తున్నారు.

నిద్ర పోయే సమయంలో...

నిద్ర పోయే సమయంలో...

నిద్ర పోయే సమయంలో మొబైల్ దగ్గర పెట్టుకోవద్దు. అలా పెట్టుకోవడం వల్ల నిద్ర చేడిపోయే ప్రమాదంతో పాటు ఫోన్ పేలితే గాయాలవడం ఖాయం.

స్నానం చేసే సమయంలో..

స్నానం చేసే సమయంలో..

స్నానం చేసే సమయంలో బాత్ రూంకి సెల్ తీసుకెళ్లొద్దు. ఒకవేళ తీసుకెళితే అది నీళ్లలో పడిపోయే ప్రమాదం ఉంది.

Best Mobiles in India

English summary
10 places where you shouldn't use your phone more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X