మురిపిస్తున్న బ్లాక్‌బెర్రీ టార్చ్ 9860

Posted By: Staff

మురిపిస్తున్న బ్లాక్‌బెర్రీ టార్చ్ 9860

ప్రపంచంలో ఎంతో ఫాస్ట్‌గా అభివృద్ది చెందుతున్న పరిశ్రమ అంటే ఠక్కున చెప్పే పేరు మొబైల్ ఇండస్ట్రీ. రాబోయే 5 సంవత్సరాలలో మొబైల్ ఇండస్ట్రీ రెవిన్యూ సుమారుగా $2 ట్రిలియన్లకు ప్రపంచ వ్యాప్తంగా పెరగవచ్చునని అంచనా. ఇందులో భాగంగానే మొబైల్ తయారీ దారులు ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీలతో కొత్త ఫీచర్స్‌తో మార్కెట్లో నెంబర్ వన్ స్దానాన్ని దక్కించుకోవడం కోసం తాపత్రయ పడుతున్నారు. ప్రస్తుతం మొబైల్ ఇండస్ట్రీలో ఉన్న కాంపిటేషన్ కూడా అలానే ఉందనుకోండి. ప్రస్తుతం కొన్ని టాప్ కంపెనీలకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ గురించిన సమాచారం విడుదల కాకముందే ఇంటర్నెట్‌లో లభిస్తుంది. ఇది ఒకందుకు మంచింది అయినా మరోకందుకు చెడుగా భావిస్తున్నారు.

ఈ మొబైల్ లీకింగ్ సమస్య బ్లాక్ బెర్రీ తయారుదారైన రీసెర్ట్ ఇన్ మోషన్‌కి కూడా తప్పడం లేదు. త్వరలో బ్లాక్ బెర్రీ కంపెనీ నుండి విడుదలవ్వాల్సిన బ్లాక్ బెర్రీ టార్చ్ 9860కి సంబంధించిన పూర్తి సమాచారం, ఫోటో లతో పాటు ఇంటర్నెట్లోని కొన్ని ప్రముఖ వెబ్ సైట్స్‌ లలో దర్శనమిస్తున్నాయి. లీకైనటువంటి ఈ ఫోటోలను బట్టి చూస్తుంటే బ్లాక్ బెర్రీ త్వరలో ఓ స్మార్ట్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేయనుందని తెలుస్తుంది. దానిపేరు బ్లాక్ బెర్రీ టార్చ్ 9860. బ్లాక్ బెర్రీ మొబైల్స్‌ని తయారు చేసేటటువంటి రీసెర్చ్ ఇన్ మోషన్ అనే సంస్ద మే నుండి దీనిపై ప్రయోగాలు చేసి త్వరలో మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.

బ్లాక్ బెర్రీ మొబైల్‌‍‌కి సంబంధించిన ట్విట్టర్, ఫేస్‌బుక్ ఎకౌంట్ల సమాచారం మేరకు బ్లాక్ బెర్రీ టార్చ్ 9860 ఈరోజే మార్కెట్లోకి విడుదలవుతుందని ట్వీట్స్‌ని బట్టి తెలుస్తంది. ఇక బ్లాక్ బెర్రీ మొబైల్ చూడడానికి ఆపిల్ కంపెనీ ఐఫోన్ 4 మాదిరే స్టన్నింగ్ బ్యూటీగా ఉందని అంటున్నారు. ఐఫోన్ 4కి బ్లాక్ బెర్రీ టార్చ్ 9860కి మద్య ఉన్న ముఖ్యమైన ఢిపరెన్స్ ఏమిటంటే బ్లాక్ బెర్రీ టార్చ్ 9860 మొబైల్ అంచులు మంచి వంపులు తిరిగి, మొబైల్ బటన్స్ ముందు భాగంలో ఉన్న ప్యానల్ లో అమర్చబడి ఉన్నాయి. యూజర్‌కి మంచి విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించడానికి గాను స్క్రీన్ సైజు 3.7 ఇంచ్‌ కలిగి ఉండి పుల్ టచ్‌ని ఆఫర్ చేస్తుంది.

స్మార్ట్ ఫోన్స్‌లలో ప్రస్తుతం ఎక్కవగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వేస్తున్న ఈ రోజుల్లో బ్లాక్ బెర్రీ టార్చ్ 9860 స్మార్ట్ ఫోన్‌లో మాత్రం బ్లాక్ బెర్రీ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. అంతేకాకుండా బ్లాక్ బెర్రీ టార్చ్ 9860లో మంచి పవర్ పుల్ 1.2 GHz ప్రాసెసర్‌తో పాటు, 768 MB RAMని కలిగి ఉండి మల్టీ టాస్కింగ్ పనులు చాలా వేగవంతంగా చేస్తుంది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 4జిబి మొమొరీ వస్తుండగా మైక్రో ఎస్‌‌డి స్లాట్ ద్వారా మొమొరీని ఎక్పాండ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది.

ఇక కెమెరా విషయానికి వస్తే బ్లాక్ బెర్రీ టార్చ్ 9860 5మెగా ఫిక్సల్ కెమెరాని కలగిఉంది. దీనితో పాటు 720p ఫార్మెట్లో హై డెఫినేషన్ వీడియా రికార్డింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. ఇక మార్కెట్లో ప్రస్తుతం ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను కూడా సపోర్ట్ చేస్తుందని సమాచారం. ఇంకా బ్లాక్ బెర్రీ టార్చ్ 9860కి సంబంధించి లేటెస్ట్ ఆప్ టేడ్స్ మీకోసం త్వరలోనే.....

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot