స్మార్ట్‌ఫోన్ పేలుళ్లకు చెక్!

Posted By:

చార్జింగ్ పెడుతున్న సందర్భంలో ఫోన్‌లలో మంటలు వ్యాపించి పెద్ద ప్రమాదాలే సంభవించాయంటూ ఇటీవల కాలంలో అనేక వార్తలు జాతీయ, అంతర్జాతీయ మీడియాలలో హల్ చల్ చేయటాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ పేలుళ్లకు ప్రధానం కారణం ఆయా ఫోన్‌లలోని లిథియం అయాన్ బ్యాటరీ అని పలు విశ్లేషణలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ బ్యాటరీలో ఉండే లిథియం లవణాలు  ద్రవరూపంలో ఉండటం చేత ఎక్కువ శాతం అగ్ని ప్రమాదానికి గురయ్యే అవకాశముందని ఇటీవల కాలంలో అనేక విశ్లేషణలు నిగ్గుతేల్చాయి.

స్మార్ట్‌ఫోన్ పేలుళ్లకు చెక్!

జపాన్‌లోని తోహోకూ విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ సమస్యకు సరికొత్త పరిష్కార మార్గాన్ని కనుగొంది. లిథియ అయాన్లను ఘనరూపంలో వాడుకున్నప్పుడు ఇటువంటి ప్రమాదాలకు తావుండదని ఈ నిపుణుల బృందం గుర్తించింది. ఈ మేరకు లిథియం బోరో హైడ్రైడ్ అనే మూలకాన్ని ఉపయోగించి కొత్తరకం బ్యాటరీలను రూపొందించింది. సాధారణంగా లిథియం బోరో హైడ్రైడ్ మూలకాన్ని రసాయన శాస్త్ర ప్రయోగశాలల్లో తరచూ ఉపయోగిస్తుంటారు. అయితే, అత్యధిక ఉష్ణోగ్రతలు, పీడనం వద్ద మాత్రమే దీనిని ఘన స్థితిలో ఉంచగలుగుతారు. తాజాగా, జపాన్ శాస్త్రవేత్తలు ఈ మూలకానికి కేఐ అనే అనువులను కలపటం ద్వారా సాధారణ ఉష్ణోగ్రత వద్ద కూడా ఈ మూలకాన్ని ఘనస్థితిలో ఉంచగలిగి కొత్త రకం బ్యాటరీకి ప్రాణం పోసారు..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting