కొత్తగా మార్కెట్లోకి వస్తున్నా నన్ను ఓ చూపు చూడండి..

By Super
|
New dual SIM models from Wynncom
ఇండియన్ మొబైల్ పరిశ్రమలోకి మరో కొత్త మొబైల్ దిగ్గజం చేరనుంది. దానిపేరే వ్యాన్ కామ్. వ్యాన్ కామ్ మొబైల్స్ మార్కెట్లోకి కొత్తగా రెండు వ్యాన్ కామ్ డబ్ల్యు-702, వ్యాన్ కామ్ డబ్ల్యు- 100 మొబైల్స్‌ని విడుదల చేయనున్నాయి. 1988వ సంవత్సరంలో స్దాపించబడిన వ్యాన్ కామ్ కంపెనీ యూజర్స్ కోసం డిటిటల్ డివైజెస్‌ని తయారు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఐతే ఇప్పడు కొత్తగా మొబైల్ రంగంలోకి రావడంతో వ్యాన్ కామ్ డిజిటల్ డివైజెస్ యాజర్లు హార్షం వ్యక్తం చేశారు.

వ్యాన్ కామ్ విడుదల చేయనున్న రెండు మొబైల్స్ వ్యాన్ కామ్ డబ్ల్యు-702, వ్యాన్ కామ్ డబ్ల్యు- 100 కూడా నలుపు, ఎరుపు కలర్స్‌లో లభ్యమవనున్నాయి. రెండు మొబైల్స్ కూడా డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో పాటు, మల్టీ టచ్ స్క్రీన్ ఫెసిలిటీని కూడా కలిగి ఉన్నాయి. డబ్ల్యు-702 మొబైల్ ఫీచర్స్ చూస్తే 2.8 ఇంచ్ డిస్ ప్లే కలగి ఉండగా, డబ్ల్యు-100 మాత్రం 1.8 ఇంచ్ డిస్ ప్లేని మాత్రమే కలిగి ఉంది. మీకు సంబంధించిన అందమైన క్షణాలను అందంగా భద్రపరచుకోవడానికి గాను కెమెరాని వీటిల్లో నిక్షిప్తం చేయడం జరిగింది.

 

రెండు మొబైల్స్‌లలో కూడా 2 మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగింది. దీని సహాయంతో హై క్వాలిటీ ఇమేజిలను తీయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న కొత్త మొబైల్ తయారీదారులు బ్యాటరీ బ్యాక్ అప్‌ని కూడా చక్కగా అందిస్తున్నారు. పవర్ బ్యాక్ అప్ విషయంలో ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్న వ్యాన్ కామ్ మొబైల్స్ సంస్ద సూపర్ క్వాలిటీ 1200 mAh బ్యాటరీని రెండు మొబైల్స్‌లలో నిక్షిప్తం చేయడం జరిగింది.

 

సాధారణంగా మొబైల్ కొనాలనుకునే యూజర్స్ ఎంటర్టెన్మెంట్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాన్ కామ్ ప్రవేశపెట్టనున్న రెండు మొబైల్స్ కూడా ఈ విషయంలో యాజర్స్‌ని నిరాశకు గురిచేయవు. మొబైల్ మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న అన్నిరకాల ఆడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తాయి. మొబైల్స్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా ఇందులో ఉన్న మైక్రో ఎస్‌‌డి స్లాట్ ద్వారా డబ్ల్యు-702లో మొమొరీని 16జిబి వరకు విస్తరించుకోవచ్చు. అదే డబ్ల్యు-100 మొబైల్‌లో మొమొరీని 10జిబి వరకు మాత్రమే విస్తరించుకునే ఫెసిలిటీని కల్పించడం జరిగింది.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్లను యూజర్స్ ఆహ్వానించడం జరుగుతుంది. ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి ఎంట్రీ లెవెల్ మొబైల్ ఫోన్లో త్వరలో విడుదల కానున్న ఈ రెండు మొబైల్స్ మార్కెట్లో తప్పకుండా క్లిక్ అవుతాయని భావిస్తున్నారు. డబ్ల్యు-702 మొబైల్‌ ధర ఇండియన్ మొబైల్ మార్కెట్లో రూ 2,995గా నిర్ణయించగా, అదే డబ్ల్యు-100 మొబైల్ ధర రూ 1,495గా నిర్ణయిండమైంది. ఇంత తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్స్ ఉన్న ఈ మొబైల్స్ మార్కెట్లో తప్పనిసరిగా వృధ్ది చెందుతాయని మొబైల్ నిపుణులు భావిస్తున్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X