నోకియా స్టోర్‌లోకి కొత్త మొబైల్ గేమ్స్ వచ్చాయోచ్!!

Posted By:

నోకియా స్టోర్‌లోకి కొత్త మొబైల్ గేమ్స్ వచ్చాయోచ్!!

 

నోకియా స్టోర్‌లో 17 మొబైల్ గేమ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు హైదరాబాద్ కు చెందిన గేమింగ్ కంపెనీ 7 సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ వెల్లడించింది. నోకియా ఎన్97మినీ, నోకియా ఎన్8, ఎక్స్ 6.2 మొబైల్ ఫోన్లు సహా సిరీస్ 40 టచ్ అండ్ టైప్ తరహా మొబైల్స్, 7 సీస్ గేమ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. నోకియా స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే ఒక్కో గేమ్‌కు 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది.

అలెక్జియా ది గ్రేట్, ది ఫైట్ 3డి, మోబిగ్జోనిక్స్, ది జార్స్-1, ది జార్స్-2, మోటో రైడర్, ర్యాలీ డ్రైవ్, ఎయిర్ వార్ 3డి, షూట్ ఔట్, క్యాచెస్ విన్ మ్యాచెస్, 3డి సుడోకు, ప్లానెట్స్ ఆఫ్ సుడోకు, నీతు- ది ఏలియన్ కిల్లర్ సహా 17 గేమ్స్ నోకియా స్టోర్‌లో లభిస్తాయని 7 సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నోకియా స్టోర్ల నుంచి రోజుకు 1.1 కోట్ల అప్లికేషన్స్‌ను డౌన్‌లోడ్‌చేసుకుంటుండగా భారత్‌లో వారానికి 1.2 కోట్ల అప్లికేషన్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటుండటం విశేషం. నోకియా, 7 సీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ల భాగస్వామ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న గేమ్ లవర్స్ ప్రపంచ శ్రేణి మొబైల్ గేమ్స్‌ను అందుకునే వీలు కలిగిందని 7 సీస్ మేనేజింగ్ డైరె క్టర్ ఎల్ మారుతి శంకర్ అన్నారు. నోకియా భాగస్వామ్యంతో మున్ముందు గేమింగ్ పోర్టుఫోలియో మరింత దూసుకుపోతుందని పేర్కొన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot