మీ ఐఫోన్ కోసం సరికొత్త వెబ్ బ్రౌజర్

Posted By: Super

మీ ఐఫోన్ కోసం సరికొత్త వెబ్ బ్రౌజర్

ఐఫోన్‌లకు చాలా కాలం నుంచి బ్రౌజర్ సాఫ్ట్‌వేర్‌లను అందిస్తున్న డాల్ఫిన్ ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుంది. పాత వెర్షన్ డాల్ఫిన్ బ్రౌజర్లను రీప్లేస్ చేసేందుకు ఇప్పుడు కొత్త వెర్షన్ బ్రౌజర్ మార్కెట్లోకి వచ్చేసింది. అత్యంత ప్రాచుర్యం పొందిన డాల్ఫిన్ బ్రౌజర్ల రూపొందించడంలో నిపుణైలన బృందం 'మొబో ట్యాప్' ఈ బ్రౌజర్‌లో ఓ సరికొత్త వెర్షన్‌ను విడుదల చేసింది.

ఈ కొత్త వెర్షన్ బ్రౌజర్ ఐప్యాడ్ మరియు ఐఫోన్‌లలో ఉండే అప్లికేషన్లను గుర్తిస్తుంది. ఈ బ్రౌజర్‌ను తొలుతగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే స్మార్ట్ ఫోన్‌ల కోసం రూపొందించారు. కాగా.. ఇప్పుడు ఇది ఐఫోన్‌ల కోసం ఉచితంగా లభిస్తుంది. ఆండ్రాయిడ్ల కోసం బ్రౌజర్లను అభివృద్ధి చేసేందుకు మార్చి 2010లో సాఫ్ట్‌బ్యాంక్ జపాన్‌తో ఈ కంపెనీ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఇంటర్నెట్ సర్ఫింగ్ కోసం ఈ బ్రౌజర్‌ను ఉపయోగించేటప్పుడు యూజర్‌కు అనుకూలంగా ఇది మారుతుంది. ట్యాబ్‌లు, స్లైడ్ బార్‌లను అందించడం ద్వారా బ్రౌజర్ ద్వారా నేవిగేషన్ చాలా సులువుగా ఉంటుంది. ఇందులో ఉండే క్విక్ యాక్సెస్ ఆప్షన్ ద్వారా మనం లిస్ట్ చేసుకున్న ఫేవరెట్ వెబ్‌సైట్లను సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

యూఆర్ఎల్‌ను పూర్తిగా టైప్ చేయనవసరం లేకుండానే బ్రౌజర్‌లో తొలి మూడు-నాలుగు క్యారెక్టర్లను టైప్ చేయగానే పూర్తి యూఆర్ఎల్ డిస్‌ప్లే అవుతుంది. ఈ బ్రౌజర్‌లో ఉన్న మరో విశిష్టత ఏంటంటే.. యూజర్ తన ఫేవరెట్ సైట్లను వేగంగా యాక్సెస్ చేసుకునేందుకు ఒక్కో ఫెవరెట్ వెబ్ పేజీకు ఒక్కో విధమైన గుర్తును (సింబల్)ను అమర్చుకోవచ్చు.

ఐఫోన్‌కు సరిపోయే విధంగా డాల్ఫిన్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించేందుకు కొన్ని నెలల పాటు శ్రమించామని మోబో ట్యాప్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యాంగ్జీ యాంగ్ అన్నారు. ఈ బ్రౌజర్‌లో ఉండే మరో విశిష్టమైన ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో వెబ్ పేజీలను థంబ్‌నెయిల్ రూపంలో కూడా చూడొచ్చు.

డెస్క్‌టాప్ బ్రౌజర్లలో మాదిరిగానే కొత్త వెర్షన్ డాల్ఫిన్ బ్రౌజర్లలో ఓపెన్ చేసిన వెబ్ పేజీలను అలానే ఉంచుతూ, కొత్త ట్యాబ్ సహాయంతో మరో వెబ్ పేజీని యాక్సెస్ చేసుకోవచ్చు. కొన్ని వెబ్ సైట్లను మొబైల్ ఫోన్ల ద్వారా యాక్సెస్ చేసినప్పుడు సదరు వెబ్ సైట్లు కొంత వరకు మాత్రమే సపోర్ట్ చేస్తాయి. డెస్క్‌టాప్ బ్రౌజర్ మాదిరిగా ఇవి మొబైల్‌లో పూర్తి వెబ్ పేజీని డిస్‌ప్లే చేయవు.

మరికొన్ని వెబ్‌సైట్లను మొబైల్ ద్వారా యాక్సెస్ చేసినప్పుడు అవి ఆటోమేటిక్‌గా మొబైల్ వెర్షన్ వెబ్ పేజీకి డైవర్ట్ చేయబడుతాయి. అయితే, అభివృద్ధి చేసిన డాల్ఫిన్ వెబ్ బ్రౌజర్ సాయంతో యూజర్ అభిష్టానికి అనుగుణంగా.. మొబైల్ బేస్డ్ వెబ్ పేజీని కానీ లేదా డెస్క్‌టాప్ వెర్షన్ వెబ్ పేజీని కానీ యాక్సెస్ చేసుకోచ్చు. మరింకెందుకు ఆలస్యం వెంటనే మీ ఐఫోన్‌లోకి సరికొత్త డాల్ఫిన్ బ్రౌజర్‌ను డౌన్‌లోడ్ చేసుకొని పూర్తి ఇంటర్నెట్ సర్ఫింగ్‌ అనుభూతిని ఎంజాయ్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot