కొత్త ఐఫోన్ లీకయ్యింది.. వింటే షాక్ అవుతారు

Written By:

ఆపిల్ కంపెనీ నుంచి త్వరలో ఓ సంచలన మొబైల్ రాబోతుందంటూ ఈ మధ్య ప్రకటనలు హోరెత్తుతున్న విషయం తెలిసిందే. ఆపిల్ నుంచి రానున్న ఆ ఫోన్ పేరే ఐఫోన్ ఎస్ఈ.. ఈ ఫోన్ వస్తే ఒక్కసారిగా మార్కెట్ షేక్ అవుతుందని ఆపిల్ ఫోన్ల ధరలు సగానికి పైగా తగ్గుముఖం పడతాయని సోషల్ మీడియాలో రీసెర్చ్ సైంటిస్టులు బల్లగుద్దీ మరీ చెప్పారు. అయితే ఆపిల్ నుంచి రానున్న ఆ ఫోన్ ఫోటోలు ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు, అయితే ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Read more: విదేశాల్లో వాడిపారేసిన ఐఫోన్లు ఇండియాలోకి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

దిగ్గజ మొబైల్ సంస్థ ఆపిల్ నుంచి వస్తున్న ఐఫోన్ ఎస్ఈ ఫొటోలు లీకయ్యాయి. లీకయిన ఫోటోల ప్రకారం కొత్తగా వస్తున్న ఎస్ఈ ఫోన్ రోస్ గోల్డ్ ఛాయతో ఉండనుంది.

2

దీనికి సంబంధించిన ఫొటోలు, చిన్న వీడియో కూడా చైనాకు చెందిన ఓ మీడియా కంపెనీ విడుదల చేసింది. చైనాలోని షెంజెన్ నుంచి ఇవి బయటకు వచ్చాయి.

3

దీంతో 2013లో ఐ ఫోన్ 5ఎస్ మాదిరి నాలుగు అంగుళాల సైజులో కొత్త ఐఫోన్ వస్తుందని వినిపించిన వదంతులు వాస్తవమే అని నిర్ధారణ అయ్యినట్లు తెలుస్తోంది.

4

అంతేకాకుండా 2015లో విడుదల చేసిన ఐఫోన్ 6ఎస్ మాదిరిగా ఫోన్ కోణాలు గుండ్రంగా ఉండేలా ఐఫోన్ ఎస్ఈని తీసుకొస్తున్నట్లు తెలిసింది.

5

ఫొటోల్లో ముదురు ఆరెంజ్ కలర్లో ఈ ఫోన్ కనిపిస్తున్న వాస్తవానికి మాత్రం రోజ్ గోల్డ్ రంగులో ఉండనుందని వీడియో ద్వారా తెలుస్తోంది. మార్చి 21న ఐఫోన్ ఎస్ఈ వస్తుందని, ఎస్ఈ అంటే స్పెషల్ ఎడిషన్ అని రూమర్లు వస్తున్న విషయం తెలిసిందే.

6

ఈ ఫోన్ రాకతో ఆపిల్ ఐ ఫోన్ ధరలు సగానికి పైగా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ ఎనలిస్టులు ఎప్పటినుంచో చెబుతున్న విషయం విదితమే. ఆపిల్ తన పట్టును ఇండియాలో నిలుపుకోవడానికి ఈ ఎత్తు వేసిందని తెలుస్తోంది.

7

ప్రధాన కెమెరా 12 మెగాపిక్సల్ , 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఏ 9 ప్రాసెసర్

8

ఆపిల్ పే చెల్లింపుల కోసం నియర్ ఫీల్డ్ కమ్యునికేషన్(ఎన్ఎఫ్‌సీ), 16 జీబీ, 64 జీబీ స్టోరేజ్ వెర్షన్

9

అమ్మకాలు మార్చి 25 నుంచి అంటే గుడ్ ప్రైడే రోజు నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

10

లీకయిన వీడియో ఇదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write New iPhone SE rumours: leaked photos show possible brighter rose gold shade
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot