స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోకి దూసుకొస్తున్న గూగుల్ పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్‌ఎల్‌

ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ మరో రెండు స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేయబోతుంది . గూగుల్ పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్‌ఎల్‌ పేర్లతో సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ లాంచ్ చేయబోతుంది.

By Anil
|

ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ మరో రెండు స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేయబోతుంది . గూగుల్ పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్‌ఎల్‌ పేర్లతో సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ లాంచ్ చేయబోతుంది. కాగా గూగుల్ పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్‌ విజయవంతమైన నేపధ్యంలో ఈ సిరీస్ కు కొనసాగింపుగా గూగుల్ పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేయబోతుంది. ఈ ఫోన్స్ త్వరలో విడుదల కాబోతున్న samsung galaxy S 9,మరియు LG స్మార్ట్ ఫోన్స్ కు గట్టి పోటీ ఇవ్వబోతుంది అని సమాచారం.

డిజైన్ అండ్ డిస్‌ప్లే మరింత కొత్తగా :

డిజైన్ అండ్ డిస్‌ప్లే మరింత కొత్తగా :

ఇది వరకు వచ్చిన గూగుల్ పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్‌ సాధారణ డిస్‌ప్లే అండ్ డిజైన్ తో రాగా గూగుల్ పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్‌ఎల్‌ మాత్రం మరింత కొత్తగా రాబోతుంది.ఈ స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే బెజెల్ లెస్ డిస్‌ప్లే త‌ర‌హాలో అందిచబోతున్నారని సమాచారం.

"Pure " ఆండ్రాయిడ్ ఎక్సపీరియెన్స్ :

ఏ థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్ ట్విక్స్ లేకుండా "Pure " ఆండ్రాయిడ్ ఎక్సపీరియెన్స్ ఇచ్చే ఏకైక ఫోన్ గూగుల్. కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ విడుదల అయినా వెంటనే గూగుల్ స్మార్ట్ ఫోన్స్ లో అప్ డేట్ వచ్చేస్తుంది.

లీక్ అయిన ఫోన్ ఫొటోస్ :

లీక్ అయిన ఫోన్ ఫొటోస్ :

గూగుల్ పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్ ఫోన్స్ ఎలా ఉండబోతున్నాయో అని గూగుల్ స్మార్ట్ ఫోన్ అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు అయితే దానికి తెర తీస్తూ బుధువారం ఈ ఫోన్ యొక్క ఫొటోస్ Mysmartprice అనే బ్లాగ్ ద్వారా బయటపడ్డాయి.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్:

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్:

ఈ స్మార్ట్‌ఫోన్స్ కు లేటెస్ట్ Android Oreo ఆపరేటింగ్ సిస్టం ఓ హైలైట్‌గా నిలవబోతుంది . దీనికి తోడు 4జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ప్రాసెసింగ్ అలానే మల్టీటాస్కింగ్ విభాగాలను మరింత బలోపేతం చేయబోతుంది.

ధర మరియు లాంచ్ డేట్ :

ధర మరియు లాంచ్ డేట్ :

ఈ సంవత్సరం చివరిలో ఫోన్ లాంచ్ అవ్వబోతుంది అని గూగుల్ సంస్థ ప్రకటించింది . అయితే ధర ఫై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు

ఇదివరకు రిలీజ్ అయిన గూగుల్ పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్‌ యొక్క ఫీచర్లును  ఒకసారి  పరిశీలించండి :

ఇదివరకు రిలీజ్ అయిన గూగుల్ పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్‌ యొక్క ఫీచర్లును ఒకసారి పరిశీలించండి :

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఫీచర్లు:
5 అంగుళాల డిస్‌ప్లే 4జీబీ ర్యామ్‌ 64జీబీ/128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా 12.2 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా 2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ఫీచర్లు:
6 అంగుళాల డిస్‌ప్లే 4జీబీ ర్యామ్‌ 64జీబీ/128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా 12.2 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా 3520 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

 

Best Mobiles in India

English summary
New leak shows Google’s Pixel 3 and Pixel 3 XL from every angle.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X