లెమన్ డ్యూయల్ సిమ్ ఫోన్ ఐటి 828

Posted By: Staff

లెమన్ డ్యూయల్ సిమ్ ఫోన్ ఐటి 828

ఫాస్ట్ ట్రాక్ కమ్యూనికేషన్ ప్రై లి సంస్ద లెమన్ హ్యాండ్ సెట్ ఫ్యామిలీకి సంబంధించి ఓ సరిక్రొత్త మొబైల్‌ని మార్కెట్లోకి విడుదల చేయనుంది. దేశంలో ఉన్న మొబైల్ కస్టమర్స్ కోసం కొత్త టెక్నాలజీని పరిచయం చేసేందుకు సిద్దమైంది. గతంలో విడుదల లెమన్ కంపెనీ విడుదల చేసిన ఫోన్స్ మాదిరే ఈ ఫోన్ కూడా కస్టమర్స్‌కు నచ్చుతుందని తెలిపారు. మార్కెట్లోకి ప్రస్తుతం విడుదల చేయనున్న ఈ వరల్డ్ క్లాస్ హ్యాండ్ సెట్ పేరు లెమన్ ఐటి 828.

లెమన్ ఐటి 828 ఫీచర్స్‌ని గనుక గమనించినట్లైతే గతంలో లెమన్ కంపెనీ విడుదల చేసిన మొబైల్ ఫోన్స్‌కి ఏ మాత్రం తగ్గకుండా యాజర్స్‌ చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 3.2 ఇంచ్ స్క్రీన్ సైజుని కలిగి ఉండి డ్యూయల్ సిమ్ ఫీచర్‌ని కలిగి ఉంది. లెమన్ ఐటి 828 మొబైల్‌ వెనుక భాగాన 3.2 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండగా, అదే ముందు భాగంలో 0.3 మెగా ఫిక్సల్ కెమెరాతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఆఫ్షన్స్ అయిన బ్లూటూత్, 3జీ డేటా ట్రాన్పర్ ఫెసిలిటీ కూడా మొబైల్‌లో కలిగి ఉంది. మార్కెట్లో లభ్యమవుతున్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేయడంతో పాటు, మ్యూజిక్ ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ రేడియో ప్రత్యేకం. ఇక గేమ్స్ కోసం ప్రత్యేకంగా జావా, షెల్ అప్లికేషన్స్‌ని సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఉన్న ఓపెరా మిని బ్రౌజర్ ద్వారా ఇంటర్నెట్‌కి ఈజీగా కనెక్ట్ అవ్వవచ్చు. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సైట్స్‌కి సంబంధించి అప్లికేషన్స్ ముందుగానే ఇందులో లోడ్ చేయబడి ఉన్నాయి. దీని ద్వారా మీరు ఎల్లప్పుడూ మీ స్నేహితులకు టచ్‌లో ఉండోచ్చు.

బ్యాటరీ విషయానికి వస్తే 1000 mAh పవర్‌ని కలిగి ఉంది. సాధారణంగా టాక్ టైమ్ 3.5 గంటలు వస్తుంది. అదే బ్యాటరీ స్టాండ్ బై టైమ్ మాత్రం 250 గంటలు. ఇన్న అత్యాధునికమైన ఫీచర్స్ కలిగిన దీని ధర కూడా ఇండియన్ కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకోని రూ 5,000గా నిర్ణయిండమైంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot