ఆండ్రాయిడ్ మొబైల్ వాడడమే కాదు, సాప్ట్ వేర్స్ గురించి కూడా

Posted By: Super

ఆండ్రాయిడ్  మొబైల్ వాడడమే కాదు, సాప్ట్ వేర్స్ గురించి కూడా

ప్రస్తుతం ఉండడానికి ఇల్లు లేకపోయినా చేతలో అన్ని కొత్త ఫీచర్స్ కలిగినటువంటి మొబైల్ మాత్రం తప్పనిసరిగా ఉంటున్న రోజులివి. కేవలం మొబైల్ మాత్రం ఉంటే సరిపోతుంది. అందులో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నించి గురించి కూడా తెలుసుకోని ఉంటే మరి మంచిది. ఎప్పటికప్పడు మొబైల్‌కి సంబంధించిన సాప్ట్‌వేర్స్ వాటి అప్‌డేట్స్ గురించి కూడా తెలుసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. మీ ఆధునిక మొబైల్‌కి పనికి వచ్చే కొన్ని సాప్ట్ వేర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కడ చూసిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ గురించే. అలాంటి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఫోన్‌కాల్స్‌ని ఆటోమాటిక్‌గా రికార్డ్‌ చేయాలంటే Phone Recorder అప్లికేషన్‌ ఉంటే సరి. 10 నిమిషాలు వరకూ రికార్డ్‌ చేస్తుంది. రికార్డ్‌ చేసిన కాల్స్‌ని పాస్‌వర్డ్‌తో సురక్షితం చేయవచ్చు. పాత కాలం టెలిఫోన్‌లో డయల్‌ చేస్తూ కాల్‌ చేయాలంటే Dial Call ఉండాలి. తెరపై డయల్‌ స్క్రీన్‌ కనిపిస్తుంది.

ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడుతుంటే MyAndroid Protection పొందండి. మాల్వేర్ల నుంచి మొబైల్‌ను రక్షిస్తుంది. మొబైల్‌ పోతే డేటాని రికవర్‌ చేయవచ్చు. మొబైల్‌ని కొవ్వొత్తిలా మార్చాలంటే Candle Light ఉండాలి. మొబైల్‌ ఛాటింగ్‌కు eBuddy Messenger పొందుపరుచుకోవాలి. ఫేస్‌బుక్‌, ఎమ్మెఎస్‌ఎన్‌, యాహూ... సర్వీల్ని సపోర్ట్‌ చేస్తుంది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో కెమేరాను సమర్థంగా వాడుకోవాలంటే Camera Advance Lite పొందండి. Timer, Burst, Reduced noise, panorama shooting mode... సదుపాయాల్ని సెట్‌ చేసుకోవచ్చు.

ఇక మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఫోటోల మీద కాస్తో కూస్తో ఆసక్తి ఉంటుంది. అలా ఫోటోల మీద ఆసక్తి ఉన్నవారు ఫొటోల నిర్వహణ సాఫ్ట్‌వేర్‌లకు కింది సైట్‌లోకి www.hackman.in, www.pocketgear.com, www.zedge.net, www.Software112.com, www.getjar.com, www.softs82.com వెళ్శి వారికి కావాల్సిన సాప్ట్‌వేర్స్‌ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot