మోటో ఎక్స్ 2014 ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ పై రూ.6,000 వరకు డిస్కౌంట్

Posted By:

మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడే అభిమానులకు శుభవార్త. మోటరోలా నుంచి ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదలైన మోటో ఎక్స్ (సెకండ్ జనరేషన్) స్మార్ట్‌ఫోన్ పై ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) రూ.6,000 ధర రాయితీతో కూడిన ఆసక్తికర ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. మార్కెట్లో మోటో ఎక్స్ (2014 ఎడిషన్) వాస్తవ ధర రూ.31,999. తాజా ఎక్స్‌ఛేంజ్  ఆఫర్‌లో భాగంగా కొత్త మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.25,999కే సొంతం చేసుకోవచ్చు..

 కొత్త మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ పై రూ.6,000 డిస్కౌంట్

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వివరాలు:

ఈ ఆసక్తికర ఆఫర్‌లో భాగంగా కండీషన్‌లో ఉన్న మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ వద్ద ఎక్స్‌ఛేంజ్ చేసినట్లయితే ఫోన్ క్వాలిటీ ఇంకా పనితీరును బట్టి రూ.6,000 వరకు రాయితీ లభిస్తుంది. ఇప్పుడు మీరు కేవలం రూ.25,999 చెల్లించినట్లయితే. మోటో ఎక్స్ 2014 ఎడిషన్ మీ సొంతమవుతుంది. ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా యాపిల్, ఆల్కాటెల్, బ్లాక్‌బెర్రీ, ఆసుస్, హెచ్‌టీసీ, హవాయి, కార్బన్, ఎల్‌జీ, లావా, లెనోవో, జియోమీ మై, మోటరోలా, మైక్రోమాక్స్, నోకియా, సామ్‌సంగ్, జోలో ఇంకా సోనీ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే ఫ్లిప్‌కార్ట్ అనుమతిస్తుంది.

మోటరోలా మోటో ఎక్స్ (2014 ఎడిషన్) కీలక ఫీచర్లు:

5.2 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్,
అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్ క్వాలిటీతో),

2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ క్వాలిటీ వీడియో కాలింగ్ అలానే, సెల్ఫీలను చిత్రీకరించుకునేందకు),
ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి),
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0 ఎల్ఈ, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ బరువు 144 గ్రాములు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
New Moto X Can Now Be Bought With Rs 6,000 Discount On Price [Exchange Offer]. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot