షాకింగ్... నోకియా 3310 ఫోన్‌ ఆ దేశాల్లో పనిచేయదు

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017లో భాగంగా నోకియా తన ఐకానిక్ 3310 హ్యాండ్‌సెట్‌ను కొత్త వర్షన్‌తో మరోసారి మార్కెట్‌కు పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఒరిజినల్ వర్షన్‌తో పోలిస్తే అప్‌గ్రేడెడ్ ఫీచర్లను కలిగి భిన్నమైన లుక్‌తో కనిపిస్తోన్న ఈ ఫోన్‌కు కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. ఇందుకు కారణం చాలా యూఎస్, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాలు 2జీ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిలిపివేస్తుండటమే.

Read More : రూ.700కే కంప్యూటర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చాలా దేశాల్లో ఈ ఫోన్ నిరుపయోగంగా మారనుంది..

ఒరిజినల్ వర్షన్‌ మాదరిగానే నోకియా 3310 కొత్త వర్షన్‌ కూడా 2జీ కాలింగ్‌కు అవసరమైన GSM 900/1800MHz బ్యాండ్ విడ్త్‌లను మాత్రమే సపోర్ట్ చేస్తుండటంతో 2జీ నెట్‌వర్క్‌ను పక్కనపెట్టేస్తున్న చాలా దేశాల్లో ఈ ఫోన్ నిరుపయోగంగా మారబోతోంది.

నాలుగు బ్యాండ్‌లను సపోర్ట్ చేయాల్సి ఉంది

ప్రస్తుత పరిస్ధితులకు అనుగుణంగా కమ్యూనికేషన్ అవసరాలను తీర్చగలిగే ఫోన్ కనీసం ఈ నాలుగు బ్యాండ్‌లను సపోర్ట్ చేయాల్సి ఉంది. అవి 850MHZ, 900MHz, 1800MHz,1900MHz.

2జీ కాలింగ్‌‌కు మాత్రమే..

భారత్‌లో నోకియా 3310 మోడల్‌కు ఎటువంటి అడ్డంకులు లేనప్పటికి 2జీ కాలింగ్‌ ఇంకా మెసేజింగ్‌కు మాత్రమే ఈ ఫోన్‌ను ఉపయోగించుకోవల్సి ఉంటుందూహి.

సరిగ్గా 17 సంవత్సరాల తరువాత..

నోకియా నుంచి 2000 సంవత్సరంలో విడుదలైన ఐకానిక్ 3310 ఫీచర్ ఫోన్‌ను సరిగ్గా 17 సంవత్సరాల తరువాత కొత్త లుక్‌తో మార్కెట్లోకి రావటంతో నోకియా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికే నోకియా 3310 (2017)కు సంబంధించి అఫీషియల్ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. పాత్ వర్షన్‌తో పోలిస్తే కొత్త వర్షన్‌ కంప్లీట్ న్యూ లుక్‌లో కనిపిస్తోంది. నోకియా 3310 (2000), నోకియా 3310 (2017) మధ్య తేడాలను పరిశీలించినట్లయితే...

డిజైన్ అండ్ డిస్‌ప్లే

నోకియా 3310 (2000) మోడల్‌లతో కొత్త వర్షన్ తక్కువ బరువుతో మరింత స్లిమ్‌‌గా అనిపిస్తుంది. డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి కొత్త వర్షన్ నోకియా 3310 2.4 అంగుళాల color LCD డిస్‌ప్లే స్ర్కీన్‌తో వస్తోంది. ఇదే సమయంలో పాత వేరియంట్ 1.5 అంగుళాల monochrome LCD డిస్‌ప్లేను మాత్రమే కలిగి ఉంటుంది.

కలర్ వేరియంట్స్

కలర్ వేరియంట్స్ విషయానికి వచ్చేసరికి 2000 మోడల్ నోకియా 3310 ఫోన్ కేవలం "typical navy blue" కలర్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. లేటెస్ట్ మోడల్ విషయానికి వచ్చేసరికి.. వార్మ్ రెడ్, డార్క్ బ్లూ, ఎల్లో, గ్రే ఇలా రకరకాల కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

 

కెమెరా విషయానికి వచ్చేసరికి..

నోకియా 3310 (2000) మోడల్‌లో కెమెరా మనుకు కనపించదు. అయితే, కొత్త వర్షన్‌లో మాత్రం LED flash సౌకర్యంతో 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాను ఏర్పాటు చేయటం జరిగింది.

కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి..

కనెక్టువిటీ ఆప్షన్స్ విషయానికి వచ్చేసరికి నోకియా 3310 (2000) మోడల్‌లో 2జీ కాలింగ్‌కు అవసరమైన dual band GSM 900/1800MHz వంటి ఎంట్రీ లెవల్ ఫీచర్లు మాత్రమే ఉండేవి. కొత్త వర్షన్‌లో మాత్రం dual band GMS 900/1800MHz సపోర్ట్‌తో పాటు మైక్రో యూఎస్బీ, బ్లుటూత్, 3.5ఎమ్ఎమ్ జాక్, మైక్రోఎస్డీ స్లాట్, ఎఫ్ఎమ్ రేడియో వంటి ఆధునిక కనెక్టువిటీ ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఈ రెండు ఫోన్‌లు 2జీ నెట్‌వర్క్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తాయి.

బ్యాటరీ ఇంకా స్టోరేజ్

బ్యాటరీ ఇంకా స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి, నోకియా 3310 (2000) వేరియంట్ 900mAh రిమూవబుల్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ 2.5 గంటల టాక్‌టైమ్, 55 గంటల స్టాండ్ బై టైమ్‌ను ఆఫర్ చేస్తుంది. ఇదే సమయంలో నోకియా 3310 (2017) వేరియంట్‌లో ఏర్పాటు చేసిన 1200mAh రిమూవబుల్ బ్యాటరీ 31 రోజుల స్టాండ్ బై టైమ్‌తో పాటు 22 గంటల టాక్ టైమ్‌ను ఆఫర్ చేస్తుంది. స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి కొత్త వర్షన్ నోకియా ఫోన్ 16ఎంబి స్టోరేజ్ కెపాసిటీతో వస్తోంది.

ధర ఇంకా అందుబాటు

మార్కెట్లో పాత వర్షన్ నోకియా 3310 ధర రూ.2,710 వరకు ఉండేది. కొత్త వర్షన్ ధర రూ.3,500 వరకు ఉంటుంది. ఏప్రిల్ లో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశముంది.

గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కేక...

అప్పటి మోస్ట్ పాపులర్ స్నేక్ గేమ్‌ను రీడిజైన్ చేసి ఈ ఫోన్‌లో పొందుపరిచారు. ఒరిజినల్ వర్షన్‌తో పోలిస్తే ఫోన్ కలర్ డిస్‌ప్లేను మరింతగా మెరుగుపరచటంతో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కొత్తగా అనిపిస్తుంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
New Nokia 3310 Won't Work in US, Canada, Australia. This Is Why. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot