గాల్లోనే ఊరిస్తున్న నోకియా c5-00 5mp

Posted By: Staff

గాల్లోనే ఊరిస్తున్న నోకియా c5-00 5mp

ప్రస్తుతం మొబైల్ ఇండస్ట్రీలో అన్ని కంపనీల మద్య కూడా గట్టి పొటీవాతవరణం నెలకోని ఉంది. ఇంతకీ ఎందులో ఈ పొటీ వాతావరణం అని అనుకుంటున్నారా..? వారి వారి కొత్త ఉత్పత్తులను మార్కెట్ లోకి విడుదల చేయడంలో. నోకియా కంపెనీ నుండి జూన్ 27న సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నోకియా సి60 మొబైల్ పోన్ విడుదల కావాల్సినప్పటికీ ఎందుకనోగానీ నోకియా దాని గురించి ఎటువంటి ఎనౌన్స్ మెంట్ చేయకపోవడం గమనార్హాం. అందుకు కారణం ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ మద్య ఉన్న పోటీయే కాబోలు.

ఇది మాత్రమే కాకుండా మొబైల్ యూజర్స్‌కి కూడా మార్కెట్లోకి స్మార్ట్ పోన్స్, టాబ్లెట్స్, ఐఫోన్స్ లాంటివి వచ్చిన తర్వాత రెగ్యులర్ మొబైల్స్ మీద బోరు కొట్టి ఉండవచ్చు. ఇందులో భాగంగానే మొబైల్ తయారీదారు సంస్దలు ఎప్పుటికప్పుడు మార్కెట్లో ఉన్న పోటీ వాతావరణాన్ని తట్టుకోవడానికి కొత్త కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్స్ బారినుండి పోటీని తట్టుకోవడానికి నోకియా కంపెనీ నుండి కొత్త ఉత్పత్తులను విడుదల చేయడం ప్రారంభించింది. అటువంటిదే మొబైల్ మీకోసం...

నోకియా త్వరలో విడుదల చేయనున్న మొబైల్ ఫోన్ నోకియా C5-00 5MP. ఇది గతంలో నోకియా విడుదల చేసినటువంటి నోకియా C5కి అప్ గ్రేడేడ్ వర్సన్. చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ మంచి పవర్ ప్యాక్ ఫీచర్స్‌తో ఉంటుంది. ఈ ఫోన్ 2.2 విజిఎ టిఎఫ్‌టి స్క్రీన్ కలిగి ఉండి ఆల్పా న్యూమరిక్ కీప్యాడ్‌తో అందంగా ఉంటుంది. ఇప్పటికే నోకియా కొన్ని మొబైల్స్‌ని సింబియన్ అన్నా ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక నోకియా C5-00 5 MP మొబైల్ ఎస్60 ఫ్లాట్ ఫామ్‌తో మార్కెట్లోకి వస్తుంది.

ఇక దీనిని టెక్నాలజీ పరంగా చూసుకుంటే 600 MHz ARM ప్రాసెసర్, 512 MB ROM, 256MB RAMతో వస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఈ మొబైల్ 32జిబి micro SD మొమొరి కార్డుని సపోర్టు చేస్తుంది. గతంలో వచ్చిన నోకియా C5కి ప్రస్తుతం నోకియా విడుదల చేసిన C5-00 5 MP మద్య ఉన్న పెద్ద తేడా ఏమిటంటే ఇందులో 5మెగా ఫిక్సల్ కెమెరా ఉందన్నారు. ఈ కెమెరా వల్ల ఒక్క సెకన్‌కి 15 ఫ్రేమ్స్ వీడియో రికార్డింగ్‌‍‌ని షూట్ చేయవచ్చు. అంతేకాకుండా నోకియా C5తో పోల్చితే ఇందులో బ్యాటరీ బ్యాక్ అప్ ఎక్కువ కాలం మన్నే విధంగా ఉంటుంది.

Key Nokia C5-00 5 MP Features:

A 5 mega pixel camera
Longer battery life
GPS with Nokia maps for better navigation
USB 2.0
USB charging and simultaneous data transfer facility
Bluetooth 2.0 + EDR
An option for over the air firmware upgrade.
Up to 32 GB expandable memory

నోకియా C5-00 5 MP విడుదలపై కంపెనీ వైపు నుండి ఎటువంటి సమాచారం లేదు. ఇక దీని ధర విషయానికి వస్తే కేవలం రూ 7500గా ఉండవచ్చునని నిపుణుల అంచనా. త్వరలోనే ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి నోకియా C5-00 5 MP విడుదల కానుందని సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot