ఎల్‌జి ఆఫ్టిమస్ ఫోన్స్: ఆప్టిమస్ ప్రో, నెట్

By Super
|
Pro and Net
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థతో రూపుదిద్దకుంటున్న స్మార్ట్ ఫోన్లకు ప్రస్తుత మొబైల్ మార్కెట్లో మంచి గిరాకీ... ఇప్పడు టాప్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ కంపెనీలన్ని ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థనే నమ్మకుంటున్నాయి... కారణం ఆండ్రాయిడ్ వ్యవస్థలోని ఆప్లికేషన్లు సులువుగా ఆపగ్రేడ్ చేసేందుకు వీలుగా ఉండటమే.. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ల మార్కట్లో 40 శాతం ఫోన్లు ఆండ్రాయడ్ ఆపరేటింగ్ వ్యవస్థతో కూడినవే అమ్మడవుతున్నాయంటే వాటికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మొబైల్ మార్కెటింగ్, ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా విఖ్యాత గాంచిన ఎల్‌జీ కంపెనీ రెండు స్మార్ ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుంది.

ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఇన్ కారినేషన్ - ఆండ్రాయిడ్ జింజర్ బోర్డు వ్యవస్థలతో పని చేసే ఈ ఫోన్లలకు ఆప్టిమస్ ప్రో, ఆప్టిమస్ నెట్ లుగా నామకరణం చేశారు. ధర విషయంలో సామన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రూపొందిస్తున్న ఈ ఫోన్లు ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న ఫోన్లకు ధీటుగా ఉంటాయిని నిపుణులు అంచనా.

టచ్ స్ర్కీన్ వ్యవస్థతో పాటు టైప్ హ్యాండ్ సెట్ సౌలభ్యత కలిగిఉన్న ఆప్టిమస్ స్మార్ట్ ఫోన్ ను 2.8 అంగుళాల డిస్ ప్లే సామర్థ్యంతో పాటు అదనంగా ఫిజికల్ క్వర్టీ కీప్యాడ్ ను రూపొందించారు. శక్తివంతమైన 800 (ఎమ్ హెచ్ జడ్) క్వాల్ కమ్ ప్రాసెస్సర్ ను 256 ఎమ్ బీ ర్యామ్ కు లేదా 512 ఎమ్ బీ రోమ్ కు జత చేసుకునే వెసులుబాటు కల్పించారు. 3 మోగా పిక్సల్ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్ వీజీఏ ఫార్మాట్లో వీడియో రికార్డింగ్ ను అంగీకరిస్తుంది. ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరో మీటర్ వంటి అత్యాధునిక అంశాలతో ఇమిడి ఉన్న ఈ స్మార్ట్ పీస్ బ్లూ టూత్ 3.0 కనెక్టువిటీ, వై -ఫై ఇంటర్నెట్ సౌకర్యాలతో పాటు, హై స్పీడ్ 3జీ నెట్ వర్కును సపోర్టు చేస్తుంది.

పూర్తిగా టచ్ స్ర్కీన్ సహకారంతో పనిచేసే ఆప్టిమస్ నెట్ మొబైల్ 3.2 అంగుళాల డిస్ ప్లే వైశాల్యం కలిగి ఉండటంతో పాటు హెచ్వీజీఏ రిసల్యూషన్ సామర్థ్యం కలిగి ఉంది. శక్తివంతమైన 800 (ఎమ్ హెచ్ జడ్) క్వాల్ కమ్ ప్రాసెస్సర్, 3 మోగా పిక్సల్ కెమెరా, వీజీఏ మోడ్ వీడియో రికార్డింగ్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరో మీటర్, బ్లూ టూత్ 3.0 కనెక్టువిటీ, వై -ఫై ఇంటర్నెట్ సౌకర్యాలతో పాటు, హై స్పీడ్ 3జీ నెట్ లు ప్రత్యేక ఆకర్షణ . డ్యూయల్ సిమ్ సామర్థ్యంతో ఎల్ జీ ప్రవేశపెట్టనున్న ఈ ఫోన్లు ఇండియా మార్కెట్లోకి 2011 చివరిలో రానున్నాయి. వీటి ధర రూ.15000 నుంచి రూ.18,000 మధ్య ఉంటుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X