టార్గెట్ ‘అడల్ట్’..పెద్దలకు మాత్రమే!?

Posted By: Prashanth

టార్గెట్ ‘అడల్ట్’..పెద్దలకు మాత్రమే!?

 

వయసు పై బడిన వారిని మినహాయించి అన్ని వయస్సుల వారికోసం స్మార్ట్‌ఫోన్‌లు వచ్చేశాయి. ఈ క్రమంలో ప్రత్యేకించి పెద్ద వయసు వారి కోసం మొబైల్ తయారీ సంస్థ ఫుజిట్సు( Fujitsu) ఓ స్మార్ట్‌ఫోన్‌ను వ్ళద్ధి చేసింది. రాకు రాకు ఫోన్ లైనప్ (Raku Raku phone line up) నుంచి ఈ ఫోన్‌ను విడుదల కానుంది. డిజైన్ ఇతర ఫీచర్లకు సంబంధించి అధికారికంగా ఏ విధమైన సమాచారం లేదు. ఈ ఫోన్ ఏలా ఉండబోతుందన్న అంశం పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫ్లిప్ ఫోన్ తరహాలో ఈ స్మార్ట్ ఫోన్ ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం . రెండు డిస్‌ప్లేలు కలిగి ఉన్న ఈ ఫోన్ సమర్థవంతమైన డస్ట్ మరియు వాటర్ ప్రూఫ్ వ్యవస్థలను కలిగి ఉంటుంది. పొందుపరిచిన మల్టీమీడియా ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో వ్యవస్థలు ఉత్తమ క్వాలిటీతో కూడిన వినోదాన్ని అందిస్తాయి. ఆండ్రాయిడ్ ఆధారితంగా ఈ ఫోన్ పనిచేస్తుంది. ఫోన్ ఇతర ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot