కొత్త రంగుల్లో ‘గెలాక్సీ ఎస్3 మినీ’!

Posted By: Prashanth

కొత్త రంగుల్లో ‘గెలాక్సీ ఎస్3 మినీ’!

 

యాపిల్కు పోటీగా సామ్‌సంగ్ నుంచి గతఏడాది ఆవిష్కరింపబడి క్లాస్ టాక్‌ను మూటగట్టకున్న గెలాక్సీ ఎస్3 మినీకి సంబంధించి నాలుగు సరికొత్త కలర్ వేరియంట్లు ఫ్రెంచ్ సామ్‌సంగ్ వెబ్‌సైట్‌లో ప్రత్యేక్షమయ్యాయి. వీటి కలర్ వేరియంట్‌లు వోనిక్స్ బ్లాక్, యాంబర్ బ్రౌన్, టైటాన్ గ్రే, గార్నెట్ రెడ్‌లుగా ఉన్నాయి. ఇప్పటి వరకు గెలాక్సీ ఎస్3 మినీ పెబ్బిల్ బ్లూ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో మాత్రమే లభ్యమవుతోంది. యూకే సహా పలు ప్రధాన మార్కెట్‌లలో విడుదలై హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న ‘సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 మినీ’ని గత డిసెంబర్‌లో దేశీయ మార్కెట్లోకి తీసుకువచ్చారు. ట్రేడస్ డాట్ కామ్ (Tradus.com) ఈ స్మార్ట్ హ్యాండ్ సెట్ ను రూ.24,349కి ఆఫర్ చేస్తోంది.

ఇన్ఫోసిస్ ఆఫీసులు (ఇండియా)

స్పెసిఫికేషన్‌లు:

4 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,

రిసల్యూషన్ 800 x 400పిక్సల్ రిసల్యూషన్,

1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 4.1జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ 8జీబి /16జీబి,

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు,

1జీబి ర్యామ్,

వై-ఫై 802.11,

బ్లూటూత్,

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,

మైక్రో యూఎస్బీ 2.0,

1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ప్రత్యేక ఫీచర్లు: ఎస్ వాయిస్, స్మార్ట్ స్టే, డైరెక్ట్ కాల్, స్మార్ట్ స్లే, బడ్డీ ఫోటో షేర్, ఎస్ బీమ్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot