కొందరివాడు కాదు అందరివాడు..!

Posted By: Staff

కొందరివాడు కాదు అందరివాడు..!

 

మొబైల్ ఫోన్ మార్కెట్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్న శామ్‌సంగ్, సామాన్య వర్గాలకు సైతం చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. ఎఫ్ఎమ్ రేడియో ప్రధాన ఆకర్షణగా, తక్కువ ధర కలిగిన మొబైల్ హ్యాండ్‌సెట్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. పేరు శామ్‌సంగ్ గురు ఇ1205.

ఫోన్ ఫీచర్లు:

1.52 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 128 x 128పిక్సల్స్), శామ్‌సంగ్ ప్రొప్రైటరీ ఆపరేటింగ్ సిస్టం, బరువు 65 గ్రాములు, ఫోన్‌బుక్ సపోర్ట్ (200ఎంట్రీలు), ఇంటర్నల్ మెమరీ 2జీబి, బ్లూటూత్, బ్రౌజర్,

నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 128 x 128), ఆడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, లౌడ్ స్పీకర్, ఆడియో జాక్, స్టాండర్డ్ 800 mAh Li ion బ్యాటరీ (టాక్ టైమ్ 9 గంటలు, స్టాండ్ బై 34 రోజులు), ధర రూ.1200.

ఆఫ్‌లైన్ మోడ్‌ను సైతం ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. సిమ్‌ఫ్రీ మెనూ యాక్సిస్, యూట్రాక్, ఆలారమ్ క్లాక్, 2జీ నెట్‌వర్క్, క్యాలెండర్, క్యాలుక్లేటర్, టైమర్, స్టాప్‌వాచ్, హ్యాండ్స్ ఫ్రీ మోడ్, మెమో తదితర ఫీచర్లు వినియోగదారుకు ఉత్తమ మొబైలింగ్‌కు సహకరిస్తాయి. పొందుపరిచిన మల్టీ ఫార్మాట్ మ్యూజిక్ ప్లేయర్ వివిధ ఆడియో ఫార్మాట్‌లను సపోర్ట్ చేస్తుంది. అమర్చిన స్టాండర్డ్ 800 ఎమ్ఏహెచ్ ల-యోన్ బ్యాటరీ 34 రోజుల సుధీర్ఘ స్టాండ్ బై నిస్తుంది. టాక్ టైమ్ 9 గంటలు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot