నోకియా సింబియన్ ఫోన్స్‌కి స్కైపీ ఫీచర్

Posted By: Super

నోకియా సింబియన్ ఫోన్స్‌కి స్కైపీ ఫీచర్

ఇటీవల కాలంలో ఆండ్రాయిడ్, సింబియన్ మొబైల్ హ్యాండ్ సెట్స్‌లలో స్వైపీ టెక్నాలజీని ఇమిడికృతం చేసిన సంగతి తెలిసిందే. స్వైపీ 2.0ని సింబియన్, సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ రెండింటిని సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లైతే టచ్ స్క్రీన్ ఫెసిలిటీ ఉన్న అన్ని రకాల మొబైల్స్‌లలోను ఈ టెక్నాలజీని ఇమిడికృతం చేస్తున్నారు. ఈ స్వైపీ టెక్నాలజీని ఇమడికృతం చేయడం వల్ల యూజర్స్ ఇచ్చేటటువంటి ఇన్‌పుట్ టెక్ట్స్, పదాలు ఈజీగా టచ్ స్క్రీన్ ద్వారా టైపు చేయవచ్చన్నమాట.

ముఖ్యంగా ఈ స్వైపీ టెక్నాలజీని క్వర్టీ కీబోర్డ్స్, స్టాండర్డ్ కీబోర్డ్స్ కోసం రూపొందించడం జరిగింది. ప్రస్తుతం కొత్తగా రూపొందించిన ఈ స్వైపీ వర్సన్ యూజర్స్‌కు కొత్త అనుభూతినిస్తుంది. దీంతో యూజర్స్ స్నేహితులకు మేసెజ్‌లను చాలా ఫాస్టుగా పంపే వీలు ఉంటుంది. దీనికి సంబంధించిన స్వైపీ వర్సన్‌ని నోకియా బీటా ల్యాబ్స్ నుండి డౌన్ లోడ్ చేసుకొవాల్సిందిగా సూచించడం జరిగింది. గతంలో ఉన్న వర్సన్‌తో పొల్చితే ఇప్పుడు విడుదల చేసేటటువంటి వర్సన్‌లో ఇంగ్లీషు(యుకె, యుఎస్), ప్రెంచ్(కెనడా) మొదలగు వాటితో రూపొందించడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం నోకియా ఓవిఐ స్టోర్ తెలుసుకొవచ్చు.

ఇటీవలే మార్కెట్లోకి నోకియా సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి మొబైల్స్ లిస్ట్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. నోకియా సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి హై ఎండ్ మొబైల్స్‌లలో (నోకియా ఎన్8, నోకియా సి7, ఈ7, సి6-01) మొదలగువి ఉన్నాయి. ప్రస్తుతం సింబియన్ అన్నా డివైజెస్‌లో స్వైపీ 2.0 వర్సన్‌తో రన్ అవుతున్నాయి.

త్వరలో విడుదల కాబోతున్న స్వైపీ కొత్త వర్సన్ సహాయంతో మెసెజింగ్, ఇన్‌పుట్ టెక్ట్స్ లాంటివి చాలా ఈజీ కానున్నాయి. ఎవరైతే సింబియన్ యూజర్స్ ఉన్నారో వారు తప్పనిసరిగా స్వైపీకి చెందిన అన్ని రకాల అప్లికేషన్స్‌ని డౌన్ లోడ్ చేసుకొవాల్సిందిగా కొరడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot