సోని ఎరిక్సన్ నుండి కొత్త ఎక్స్ పీరియా: 'ఎక్స్ పీరియా రే' ఫీచర్స్ మీకోసం

Posted By: Staff

సోని ఎరిక్సన్ నుండి కొత్త ఎక్స్ పీరియా: 'ఎక్స్ పీరియా రే' ఫీచర్స్ మీకోసం

సోని ఎరిక్సన్ ఇటీవల కాలంలో ఎక్స్‌పీరియా సిరిస్ స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్‌లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. సోని ఎరిక్సన్ ఎక్స్‌పీరియా సిరిస్ స్మార్ట్ ఫోన్స్ గ్లోబల్‌గా సోని ఎరిక్సన్ సేల్స్‌ని 40 శాతానికి పెంచాయి. ప్రస్తుతానికి సోని ఎరిక్సన్ ఎక్స్‌పీరియా సిరిస్‌కు సంబంధించి పది మోడళ్శు మార్కెట్‌లో హాల్ చల్ చేస్తున్నాయి. రాబోయే కాలంలో వీటి అభివృద్దిని దృష్టిలో పెట్టుకొని మరిన్ని మోడళ్లను మార్కెట్ లోకి విడుదల చేయాలని సోని కంపెనీ భావిస్తుంది. సోని ఎరిక్సన్ ఎక్స్‌పీరియా సిరిస్‌లో మరిన్ని మోడళ్లు మార్కెట్ లోకి రావడానికి సిద్దంగా ఉన్నాయని తెలిపారు.

ఇటీవల కమ్యూనిక్ ఆసియా 2011లో సోని ఎరిక్సన్ ఎక్స్‌పీరియా మోడల్స్‌ను మార్కెట్ లోకి ప్రవేశపెడుతున్నట్లు చెప్పకుండా ఏవో రెండు మోడళ్లును మార్కెట్ లోకి విడుదల చేస్తున్నామని తెలిపింది. ఐతే ఆ తర్వాత సపరేట్‌గా మరో ఈవెంట్‌ని ఏర్పాటు చేసి సోని ఎరిక్సన్ ఎక్స్‌పీరియా మోడల్‌ని ప్రకటించింది. ఇలా సోని ఎరిక్సన్ చేయడం వెనుక రహాస్యం మరేమి లేదు. ప్రత్యేకంగా సోని ఎరిక్సన్ ఎక్స్‌పీరియాని హైలెట్ చేయడం కోసమే ఈవెంట్ క్రియేట్ చేసినట్లు తెలిపారు.

సోని ఎరిక్సన్ ఎక్స్‌పీరియా రే డిజైన్ మాదిరే Xperia X10ని రూపోందించడం జరిగిందన్నారు. ఇది మాత్రమే కాకుండా ఎక్స్ పీరియా ఆర్క్ నుండి కూడా కొన్ని డిజైన్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేయడం జరిగిందన్నారు. Xperia X10తో గనుక ఎక్స్ పీరియా రేని పోల్చినట్లైతే ఆకారంలో చిన్నదిగా ఉంటుంది. ఫోన్‌లో ఉన్నటువంటి హైడెఫినేషన్ కంటెంట్‌ని చూడడం కోసం దీని స్క్రీన్ డిప్లే సైజు 3.3 ఇంచ్ కలిగి ఉంటుంది. మొబైల్ లోకి ఎటువంటి దుమ్ము, ధూళిని రానివ్వకుండా ఇది కాపాడుతుంది. సోని ఎరిక్సన్ నుండి వచ్చినటువంటి కొత్త మొబైల్ ఫోన్స్‌లో Timescape UI కలిగి ఉండడం దీని ప్రత్యేకత. ఇక ఈ మొబైల్ ఫోన్‌ని వాడడానికి అనుకూలంగా అప్లికేషన్స, మెను టాబ్స్ చాలా అందంగా తీర్చిదిద్ది ఉంటాయి.

ఇకపోతే ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్నటువంటి అన్ని ఫోన్స్ మాదిరే ఇది కూడా మల్టిమీడియాని సపోర్టు చేస్తుంది. ఎక్స్ పీరియా రే లో ఉన్నటువంటి కెమెరా వల్ల హైడెఫినేషన్ వీడియోని తీయగలుగుతాం. మొబైల్‌తో పాటు కొంత ఇంటర్నల్ మొమొరి ఉన్నప్పటికి, మైక్రో ఎస్‌డి స్టాట్ ద్వారా బయట మొమొరీని కూడా వేసుకునే అవాకశం ఉంది. ఇక ఫోన్ కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్, వై-పై, 3జిని సపోర్టు చేస్తూ హైస్పీడ్ ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయవచ్చు.

Xperia Ray features are:

Android Gingerbread OS
Multimedia support
3G, Wi-Fi and Bluetooth
8 Mega Pixel Camera with LED flash

ఇక ఈ ఫోన్ ఖరీదు విషయానికి వస్తే దాదాపు సుమారుగా రూ 25000 ఉండవచ్చునని అంచనా...

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting