కొత్త సంవత్సరం.. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్

Posted By: Prashanth

కొత్త సంవత్సరం.. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్

 

బ్లాక్ బెర్రీ మొబైల్స్ తయారీదారు రీసెర్చ్ ఇన్ మోషన్ గతంలో ఉన్న క్యూఎన్ఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు బదులు 'బిబిఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌'ని మార్కెట్లోకి విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌కు బ్లాక్ బెర్రీ సంస్ద ఓ సరిక్రొత్త పేరుతో విడుదల చేయనుంది. దాని పేరు 'బ్లాక్‌బెర్రీ 10' గానామకరణం చేయనున్నట్లు అఫీసియల్‌గా ప్రకటించారు.

ఈ విషయాన్ని #BBDevCon ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌కి ప్ర్తత్యేకంగా 10 అని నెంబర్‌ని పెట్టడానికి గల కారణాలను కూడా వెల్లడించారు. బిబిఎక్స్ అంటే B(lack)B(erry)X(10)గా తీసుకొవడం జరిగింది. రోమన్ సంఖ్యలోని 'X' అనే నెంబర్ 10 నెంబర్‌కి శుభసూచికం కాబట్టి రాబోయే కాలంలో విడుదల చేయనున్న బిబిఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి 'బ్లాక్‌బెర్రీ 10' పేరుతో విడుదల చేయనున్నామని అన్నారు.

గతంలో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ 'క్యూఎన్ఎక్స్'తో పొల్చితే 'బిబిఎక్స్' చాలా ఫాస్టుగా పని చేస్తుందని అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో 'బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్ 7' హాల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. కానీ సడన్‌గా బ్లాక్ బెర్రీ వర్సన్ 8, 9లను వదిలి పెట్టి ఒక్కసారిగా 10 నెంబర్‌ని సెలక్ట్ చేసుకొవడానికి కారణం యూజర్స్ సాధారణంగా వరుస నెంబర్స్‌కి అలవాటు పడి ఉంటారు కాబట్టి.. అలాంటి వాటిని పొగోట్టాలనే ఉద్దేశ్యంతో 10 నెంబర్‌ని సెలెక్ట్ చేసుకొవడం జరిగిందన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot