‘ఫోటో లీక్’..?

By Super
|
Nexus 4: Latest Image Leak suggests White Variant of the Google Smartphone Coming Soon


గూగుల్ బ్రాండెడ్ ఫోన్ ఎల్‌జీ నెక్సస్ 4కు సంబంధించి మరోవార్త వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. బ్లాక్‌వర్షన్ ఎల్‌జీ నెక్సస్ 4 ఇప్పటికే మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్న నేపధ్యంలో వైట్ వర్షన్‌కు సంబంధించిన కీలక ఫోటోగ్రాఫ్ నెట్‌లో ప్రత్యక్షమైంది. ఈ అంశం ఆండ్రాయిడ్ అభిమానల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నప్పటికి గూగుల్ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఆండ్రాయిడ్4ఫ్యాన్స్ డాట్ కామ్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఛాయాచిత్రం వైట్ వర్షన్‌ ఎల్‌జీ నెక్సస్ 4 త్వరలో రిటైల్ మార్కెట్లను తాకనుందన్న సంకేతాలను సూచిస్తుంది.

గూగుల్ నెక్సస్ 4 ఫీచర్లు:

4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,

రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్ (జిరోగ్యాప్ టెక్నాలజీ),

ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

క్వాడ్-కోర్ 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో ప్రాసెసర్,

2జీబి ర్యామ్,

ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబి,16జీబి,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

1.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

నియర్‌ఫీల్డ్ కమ్యూనికేషన్,

వై-ఫై,

బ్లూటూత్,

2100ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ (టాక్‌టైమ్ 15.3 గంటలు, స్టాండ్‌బై 390 గంటలు),

అదనపు ఫీచర్లు: ఫోటో స్పియర్ కెమెరా, గెస్ట్యర్ టైపింగ్, మిరాకాస్ట్, డేడ్రీమ్, మెరుగుపరచబడిన నోటిఫికేషన్స్, క్విక్ సెట్టింగ్స్, మల్టీపుల్ యూజర్ అకౌంట్స్).

Read in English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X