హెచ్‌టీసీ వన్ ఎమ్9 ఫోన్‌లోని అదరగొట్టే ఫీచర్లు
‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2015' వేదికగా హెచ్‌టీసీ, తన ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ హెచ్‌టీసీ వన్ ఎమ్9ను ఆవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల మూడవ వారం నుంచి వీటి విక్రయాలు ఉంటాయి. పూర్తి మెటల్ యునిబాడీ డిజైన్‌తో వస్తోన్న హెచ్‌టీసీ వన్ ఎమ్9 డ్యుయల్ టోన్ సిల్వర్, డ్యుయల్ టోన్ రోజ్ గోల్డ్, సింగిల్ టోన్ గన్ మెటల్ గ్రే, సింగిల్ టోన్ గోల్డ్, డ్యుయల్ టోన్ గోల్డ్ ఇంకా పింక్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (1080x1920పిక్సల్స్) 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ఆక్టా కోర్ (క్వాడ్‌కోర్ 2గిగాహెర్ట్జ్ + క్వాడ్‌కోర్ 1.5గిగాహెర్ట్జ్) ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. 20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (సఫైర్ కవర్ లెన్స్, బీఎస్ఐ సెన్సార్, ఎఫ్/2.2 అపెర్చర్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్ వంటి ప్రత్యేకతలతో), 4 అల్ట్రా పిక్సల్ ఫ్రంట్ కెమెరా. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్ల విషయానికొస్తే.. సింగిల్ నానో సిమ్ కార్డ్, వేగవవంతమైన 4జీ ఎల్టీఈ, 3జీ, జీపీఆర్ఎస్/ఎడ్జ్, మైక్రో యూఎస్బీ, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వై-ఫై, బ్లూటూత్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, కంపాస్, మ్యాగ్నటిక్, సెన్సార్ హబ్. 2840 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థ హెచ్‌టీసీ వన్ ఎమ్9లో ఏర్పాటు చేసారు. ఫోన్ చుట్టుకొలత 144.6x69.7x9.61మిల్లీ మీటర్లు, బరువు 157 గ్రాములు.

హెచ్‌టీసీ వన్ ఎమ్9 ఫోన్‌లోని అదరగొట్టే ఫీచర్లు
20 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

హెచ్‌టీసీ వన్ ఎమ్9 ఫోన్‌లోని అదరగొట్టే ఫీచర్లు
అల్ట్రా పిక్సల్ ఫ్రంట్ కెమెరా

హెచ్‌టీసీ వన్ ఎమ్9 ఫోన్‌లోని అదరగొట్టే ఫీచర్లు
సెన్స్ 7.0 యూజర్ ఇంటర్‌ఫేస్,

హెచ్‌టీసీ వన్ ఎమ్9 ఫోన్‌లోని అదరగొట్టే ఫీచర్లు
ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ

హెచ్‌టీసీ వన్ ఎమ్9 ఫోన్‌లోని అదరగొట్టే ఫీచర్లు
లగ్జరీ లుక్‌లో డిజైన్ కాబడిన హెచ్‌టీసీ వన్ ఎమ్9 గోల్డ్ సిల్వర్, గోల్డ్ పింక్, గన్ మెటల్ కలర్ వేరియంట్ లలో లభ్యమవుతోంది.

హెచ్‌టీసీ వన్ ఎమ్9 ఫోన్‌లోని అదరగొట్టే ఫీచర్లు
బూమ్ సౌండ్ టెక్నాలజీ, డాల్బీ ఆడియో సరౌండ్


Click it and Unblock the Notifications








