లోకల్ బ్రాండ్‌లకు డేంజర్ బెల్స్, చైనాదే ఇండియన్ మార్కెట్!

టాప్-5 లిస్ట్‌లో ఒక్క ఇండియన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌కు కూడా చోటు లభించకపోవటం విశేషం.

|

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా బ్రాండ్‌లు జెట్ స్పీడ్‌లో దూసుకువెళుతున్నాయి. షియోమీ, లెనోవో, ఒప్పో, వివో వంటి చైనా బ్రాండ్‌లు మార్కెట్ పై పూర్తి స్ధాయిలో దృష్టి సారించటంతో లోకల్ బ్రాండ్‌లకు సంబంధించిన మార్కెట్ వాటా 19శాతానికి క్షీణించిన్నట్లు గ్లోబల్ రిసెర్చ్ సంస్ధ ఐడీసీ తన తాజా నివేదికలో వెల్లడించింది. 2016, 4వ క్వార్టర్‌కు గాను వెల్లడైన ఫలితాల్లో, ఒక్క ఇండియన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌కు కూడా టాప్-5 లిస్ట్‌లో చోటు లభించకపోవటం విశేషం.

Read More : విడుదలకు సిద్దమవుతోన్న నోకియా 5, నోకియా 3, నోకియా 3310..?

 20.3శాతానికి పడిపోయిన అమ్మకాలు..

20.3శాతానికి పడిపోయిన అమ్మకాలు..

2016, 4వ త్రైమాసికంలో దేశీయంగా 2.58 కోట్ల ఫోన్‌లు అమ్ముడయ్యయాని, ఈ అమ్మకాలను 2015, 4వ త్రైమాసికంతో పోల్చి చూసినట్లయితే అమ్మకాల వృద్ధి అంతగా నమోదు కాలేదని ఐడీసీ నివేదిక ద్వారా తెలిపింది. అయితే, 2016 3వ త్రైమాసికంతో పోలిస్తే నాలుగ త్రైమాసిక విక్రయాలు 20.3శాతానికి పడిపోయినట్లు ఐడీసీ నివేదిక చెబుతోంది. నోట్ల రద్దు ప్రభావం నవంబంర్ - డిసెంబర్ కొనుగోళ్ల పై పడినట్లు ఐడీసీ తెలపింది. 

మొత్తం మీద 10.91  కోట్ల ఫోన్‌లు

మొత్తం మీద 10.91 కోట్ల ఫోన్‌లు

2016 ఏడాది మొత్తం మీద 10.91 కోట్ల ఫోన్‌లు దేశీయంగా విక్రయించబడ్డాయని ఐడీసీ తెలిపింది. ఈ అమ్మకాలను 2015 విక్రయాలతో పోల్చిచూసినట్లయితే 5.2శాతం వృద్ధిని నమోదు చేసినట్లే. ముందుగా వేసుకున్న మార్కెట్ అంచనాలతో పోలిస్తే ఈ అమ్మకాలు తక్కువని ఐడీసీ ఇండియా, క్లయింట్ డివైసెస్ సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు కార్తీక్ జే తెలిపారు.

ఒక్క ఇండియన్ బ్రాండ్ కూడా లేదు..
 

ఒక్క ఇండియన్ బ్రాండ్ కూడా లేదు..

2016 అక్టోబర్-డిసెంబర్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో చైనా బ్రాండ్‌లు 46 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకున్నాయి. ఇదే సమయంలో లోకల్ బ్రాండ్‌ల వాటా 19శాతానికి పడిపోయింది. ఈ క్వార్టర్‌కు గాను అత్యధిక స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించిన టాప్-5 బ్రాండ్‌ల జాబితాలో ఒక్క ఇండియన్ బ్రాండ్ కూడా లేదని, ఇలా జరగడం ఇదే తొలసారని ఐడీసీ పేర్కొంది.

 13.61 కోట్ల ఫీచర్ ఫోన్‌లు

13.61 కోట్ల ఫీచర్ ఫోన్‌లు

ఫీచర్ ఫోన్ యూజర్ల దృష్టిలో స్మార్ట్‌ఫోన్ ధరలు కాస్తంత ఎక్కువుగా అనిపించటంతో ఫీచర్ ఫోన్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లకు మైగ్రేట్ అయ్యే వారి సంఖ్య నెమ్మదించిందని ఐడీసీ తన నివేదికలో భాగంగా వివరించింది. 2016 మొత్తం మీద భారత్‌లో 13.61 కోట్ల ఫీచర్ ఫోన్‌లు అమ్ముడైనట్లు ఐడీసీ తెలిపింది.

ఆన్‌లైన్ అమ్మకాలు వాటా 31.2శాతం

ఆన్‌లైన్ అమ్మకాలు వాటా 31.2శాతం

2016 అక్టోబర్-డిసెంబర్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో భాగంగా ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల వాటా 31.2శాతంగా ఉంది. ఇందులో సగానికి పైగా అమ్ముడైన ఫోన్‌లు షియోమీ ఇంకా లెనోవో బ్రాండ్‌లవే.

 సామ్‌సంగ్ మొదటి స్ధానం

సామ్‌సంగ్ మొదటి స్ధానం

2016 అక్టోబర్-డిసెంబర్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో భాగంగా సామ్‌సంగ్ 25.1 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్ధానంలో నిలించింది.

తరువాతి స్ధానాల్లో...

తరువాతి స్ధానాల్లో...

10.7శాతం మార్కెట్ వాటాతో షియోమీ రెండవ స్ధానంలో నిలించింది. 9.9 శాతం మార్కెట్ వాటాతో లెనోవో గ్రూప్ మూడవ స్ధానంలో నిలించింది. 8.6 శాతం మార్కెట్ వాటాతో ఒప్పో నాలుగవ స్ధానంలో నిలించింది. 7.6 శాతం మార్కెట్ వాటాతో వివో 5వ స్ధానంలో నిలించింది.

Best Mobiles in India

English summary
No Indian brands in top five vendor list in Q4. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X