చౌకబారు స్మార్ట్ ఫోన్స్‌ని తయారు చేసి, కస్టమర్స్‌ని మోసం చేయలేం..

Posted By: Super

చౌకబారు స్మార్ట్ ఫోన్స్‌ని తయారు చేసి, కస్టమర్స్‌ని మోసం చేయలేం..

తైవాన్ స్మార్ట్ ఫోన్ తయారీదారైన 'హెచ్‌టిసి' రాబోయే కాలంలో తక్కువ ఖరీదు కలిగిన స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేస్తుందంటూ వస్తున్న రూమర్స్‌పై 'హెచ్‌టిసి' అధికార ప్రతినిధులు వివరణ ఇచ్చారు. ఈ సందర్బంలో వారు మాట్లాడుతూ 'హెచ్‌టిసి' ఓ బ్రాండెడ్ కంపెనీ. మాకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్ వాల్యూ మార్కెట్లో ఉంది. అటువంటి బ్రాండ్ వాల్యూని మార్కెట్లో నిలబెట్టుకునేందుకే ఎల్లప్పుడూ మేము ప్రయత్నిస్తుంటాం.. కానీ ఇటీవల రోజుల్లో 'హెచ్‌టిసి' చౌకబారైన స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్లోకి తెస్తుందంటూ వచ్చిన వార్తలలో నిజం లేదని స్పష్టం చేశారు.

కంపెనీ ఛీప్ ఫైనాన్సియల్ ఆఫీసర్ విన్సటన్ యంగ్ ఇన్వెస్టర్ల మీటింగ్‌లో మాట్లాడుతూ కంపెనీ ఆదాయం మూడవ త్రైమాసికంతో పోల్చి చూస్తే నాల్గవ త్రైమాసికంలో అభివృద్ది ఎక్కువగా ఉండాలని కొరుకుంటున్నామని స్పష్టం చేశారు. అందుకే చౌకబారైన స్మార్ట్ పోన్స్ విడుదలకు మేము సిద్దంగా లేమని తెలియజేశారు. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ ఫోన్స్‌ వైపే మొగ్గు చూపుతారని స్పష్టం చేశారు.

హై పవర్ డివైజెస్‌తో పాటు అత్యాధునిక ఆపరేటింగ్ సిస్టమ్‌లను స్మార్ట్ పోన్స్‌లలో రన్ చేసి, కస్టమర్స్‌కు అనుభూతిని అందివ్వడమే మా ప్రధమ కర్తవ్యం అన్నారు. అందులో భాగంగానే మార్కెట్లోకి కొత్తగా హెచ్‌టిసి స్మార్ట్ ఫోన్స్‌లలో 'హెచ్‌టిసి సెన్స్ సాప్ట్ వేర్' ని ఇమడింప జేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇప్పుడు సడన్‌గా ఈ చౌకబారు స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడుకొవడానికి గల కారణం.

హెచ్‌టిసి ఛైర్‌ఉమెన్ చెర్ వాంగ్ తైవనీజ్ న్యూస్ పేపర్స్‌‌కి ఇచ్చిన ఇంటర్యూలో మార్కెట్ షేర్‌ని పెంచుకునేందుకు గాను హెచ్‌టిసి చౌకబారు స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనుందని అనడమే. హెచ్‌టిసి ఇటీవలే చైనాలో సుమారు 1,000 వరకు హెచ్‌టిసి మొబైల్ స్టోర్స్‌ని ప్రారంభించింది. దాంతో మొబైల్స్ ఉత్పత్తిని పెంచేందుకు గాను త్వరలో ఓ పెద్ద మొబైల్ ఫ్లాంట్‌ని నిర్మించాలని కూడా తలపెట్టింది. ఆ తర్వాత సంవత్సరానికి 40మిలియన్ స్మార్ట్ ఫోన్స్‌ ఉత్పత్తే తమ ద్యేయంగా ఉంటుందని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot