చేదు వార్త.. గుడ్‌బై చెప్పేసింది?

క్వర్టీ హార్డ్‌వేర్ ఫోన్ల తయారీని నిలుపుదల చేస్తున్నట్లు హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ హెచ్‌టీసీ సంచలన ప్రకటన చేసిందని విశ్వసనీయ వర్గాలు ఉటంకించాయి. సియాటిల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కంపెనీ డిజైన్ టీమ్ భవిష్యత ప్రణాళికలో భాగంగా ఈ వివరాలను వెల్లడించినట్లు సమాచారం. క్వర్టీ హార్డ్‌వేర్ వ్యవస్థతో పనిచేసే పలు ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లను హెచ్‌టీసీ డిజైన్ చేసింది. మార్కెట్లో ఆశాజనకమైన ఫలితాలు రాకపోవటంతో ఈ డిజైన్ ప్లాన్ నుంచి విరమించుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. హెచ్‌టీసీ తీసుకున్న నిర్ణయం ఏలా ఉన్నప్పటికి, ఈ చర్య పట్ల అభిమానులు ఆసంతృప్తికి లోనవుతున్నారు.
హెచ్‌టీసీ వారి మరో డ్యూయల్ సిమ్ ఫోన్ ఆండ్రాయిడ్ 4.0 ఐసీహెచ్ (HTC T328W) ఫీచర్లు:
సరికొత్త డ్యూయల్ సిమ్‌ఫోన్ హెచ్‌టీసీ విండ్ ఇటీవల చైనా మార్కెట్లో విడుదలై అక్కడి మీడియా ద్ళష్టిని ఆకర్షించింది. ఉపయుక్తమైన అంశాలు ఈ ఫోన్‌లో ఒదిగి ఉండటంతో అక్కడ వినియోగదారలు నుంచి పెద్ద ఎత్తున స్పందన లిభిస్తోంది. హెచ్‌టీసీ టీ328డబ్ల్యూ (HTC T328W)గా రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్‌ఫోన్ అత్యాధునిక ఆండ్రాయిడ్ వోఎస్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ పై రన్ అవుతుంది.
హ్యాండ్‌సెట్ ముఖ్య ఫీచర్లు:
- డ్యూయల్ సిమ్ సపోర్ట్,
- సూపర్ ఎల్‌సీడీ టెక్నాలజీతో కూడిన 4 అంగుళాల స్ర్కీన్ (పిక్సల్ రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్) ,
- 5 మెగా పిక్సల్ కెమెరా,
- ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
- 1 జిగాహెడ్జ్ సామర్ధ్యం కలిగిన సింగిల్ కోర్ ప్రాసెసర్,
- గుగూల్ సెన్స్ 4.0 యూజర్ ఇంటర్‌ఫేస్,
- 512 ఎంబీ ర్యామ్,
- 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
- సమర్ధవంతమైన మూడు టచ్ సెన్సిటివ్ బటన్స్,
- సుదీర్ఘ బ్యాకప్ నిచ్చే 1650mAhబ్యాటరీ,
- ధర రూ.16,000.


Click it and Unblock the Notifications