భారత్‌లో నవంబర్ 10 నుంచి స్కైప్ కాల్స్ బంద్

నవంబర్ 10 నుంచి భారత్‌లో స్కైప్ ఫోన్ కాల్స్ సాధ్యపడవని మైక్రోసాఫ్ట్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. స్కైప్ అప్లికేషన్ ద్వారా భారత్‌లో మొబైల్ ఫోన్స్ ఇంకా ల్యాండ్‌లైన్ ఫోన్‌లకు ఉచితంగా కాల్స్ చేసుకునే అవకాశాన్ని మరి కొద్ది రోజుల్లో నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. దీంతో 2014, నవంబర్ 10 నుంచి భారత్ నుంచి భారత్‌లో ఉన్నవారికి స్కైప్ అప్లికేషన్ ద్వారా ఫోన్ కాల్స్ చేయటం సాధ్యపడదు. భారత్‌లో ఈ సర్వీసును నిలిపివేయడానికి గల కారణాలను మైక్రోసాఫ్ట్ వెల్లడించలేదు. అయితే, విదేశాల నుంచి భారత్‌కు, భారత్ నుంచి విదేశాలకు ఈ యాప్ ద్వారా కాల్స్ నిర్వహించుకోవచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది. స్కైప్ వై-ఫై, స్కైప్ ఎస్ఎంఎస్ సేవలు భారత్‌లో పనిచేస్తాయని కంపెనీ తెలిపింది.
నెటిజనులు అత్యధికంగా వినియోగించే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లలో స్కైప్ (skype)ఒకటి, ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సర్వీస్‌ను ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నవారు ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఉచితంగా మొబైల్, ల్యాండ్ ఫోన్‌లకు కాల్స్ చేసుకోవచ్చు అలానే వీడియో చాటింగ్ కూడా నిర్వహించుకోవచ్చు. హీన్లా, ప్రిట్, జాన్ తాల్లిన్ అనే ముగ్గురు డెవలపర్లు ఈ ప్లాట్‌ఫామ్‌ను వృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా స్కైప్‌కు 600 మిలియన్‌ల యూజర్లు ఉన్నారు. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, స్కైప్ ప్లాట్‌ఫామ్‌ను 2011లో $8.5బిలియన్‌లు చెల్లించి సొంతం చేసుకుంది. ఫైల్ ట్రాన్స్‌ఫర్, వీడియో కాన్ఫిరెన్సింగ్ వంటి అదనపు ఫీచర్లను స్కైప్ కలిగి ఉంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








