ఈ ఫోన్‌లో స్టోరేజ్ సమస్యే ఉండదు..?

Written By:

శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ Nextbit ఇటీవల తన మొదటి క్లౌడ్ - బేసిడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ Nextbit Robinను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ధర రూ.19,999.

 ఈ ఫోన్‌లో స్టోరేజ్ సమస్యే ఉండదు..?

100 జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్ స్పేస్ సదుపాయంతో వస్తోన్న ఈ ఫోన్‌ ముందస్తు బుకింగ్స్ నేటి నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Flipkart ఈ ఫోన్‌‌‍కు సంబంధించిన బుకింగ్స్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా తీసుకుంటోంది. మే 30 నుంచి ఫోన్ అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాలు క్రింది స్లైడర్‌లో.....

Read More : భారత్‌లో నోకియా 5జీ ట్రెయిల్..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే, ఆపరేటింగ్ సిస్టం

Nextbit Robin ఫోన్ ప్రత్యేకతలు

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ ఆధారంగా డిజైన్ చేసిన నెక్స్ట్‌బిట్ ఆపరేటింగ్ సిస్టం,

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్

Nextbit Robin ఫోన్ ప్రత్యేకతలు

2 గిగాహెర్ట్జ్ హెక్సా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 808 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్లీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 100జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్ స్పేస్,

కెమెరా, బ్యాటరీ

Nextbit Robin ఫోన్ ప్రత్యేకతలు

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 2.0 టెక్నాలజీతో కూడిన 2,680 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కనెక్టువిటీ ఫీచర్లు

Nextbit Robin ఫోన్ ప్రత్యేకతలు

4జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లుటూత్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్

ప్రత్యేకమైన ఎన్‌క్రిప్షన్ వ్యవస్థ

Nextbit Robin ఫోన్ ప్రత్యేకతలు

Nextbit Robin ప్రత్యేకమైన ఎన్‌క్రిప్షన్ సపోర్ట్‌తో వస్తోంది. ఈ ఫీచర్ ఫోన్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తుంది. క్లౌడ్ స్టోరేజ్ సర్వర్‌లో సేవ్ కాబడి మీ ఫోన్ డేటాను పూర్తిస్థాయిలో ఎన్‌క్రిప్ట్ చేసి ఉంచుతుంది.

స్మార్ట్ ఆపరేటింగ్ సిస్టం

Nextbit Robin ఫోన్ ప్రత్యేకతలు

Nextbit Robin ఫోన్‌లో ఏర్పాటు చేసిన స్మార్ట్ Nextbit ఆపరేటింగ్ సిస్టం క్లౌడ్‌తో ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌ను అనుంధానిస్తుంది. దీంతో ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ మరింత సెక్యూర్‌గానూ సౌకర్యవంతంగానూ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ను వై-ఫైకు కనెక్ట్ చేసినపుడు డివైస్‌‌ను మరింత ఫ్రీగా ఉంచేందుకు కంటెంట్‌ను క్లౌడ్‌కు సింక్ చేసేస్తుంది.

ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ పై ఒత్తిడి పడకుండా

Nextbit Robin ఫోన్ ప్రత్యేకతలు

Nextbit Robin స్మార్ట్‌‍ఫోన్‌లోని ఫోటోలు, యాప్స్ నిరంతరం క్లౌడ్ స్టోరేజ్‌తో సింక్ అవుతూనే ఉంటాయి. తద్వారా ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ అలానే ర్యామ్ పై ఎటువంటి ఒత్తిడి ఉండదు.

ఖచ్చితత్వంతో పనిచేసే ఫింగర్ ప్రింట్ స్కానర్

Nextbit Robin ఫోన్ ప్రత్యేకతలు

ఫోన్ పవర్ బటన్‌లో ఏర్పాటు చేసిన ఫ్రింగర్ ప్రింట్ స్కానర్ చాలా ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ సహాయంతో సెకను కన్నా తక్కువ వ్యవధిలోనే ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
You Will No Longer Face Storage Crunches On Your Phone With Nextbit Robin at Rs 19,999. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot