MWC 2018లో దుమ్మురేపిన నోకియా, అదరగొడుతున్న కొత్త ఫోన్లు !

Written By:

మొబైల్ రంగంలో దూసుకుపోతున్న HMD Global సంస్థ తన లేటెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌ను స్పెయిన్ లోని బార్సిలోనియాలో జరుగుతున్న MWC 2018 ఈవెంట్లో లాంచ్ చేసింది. కాగా నోకియా 1 పేరుతో ఈ ఫోన్ ని కంపెనీ లాంచ్ చేసింది. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే ఆండ్రాయిడ్ గో వర్షన్ లోని ఆండ్రాయిడ్ ఓరియోతో రానున్న మొట్టమొదటి ఫోన్ ఇది. ఇది ఈ వారంలోనే మార్కెట్లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. లైట్ వెయిట్ వర్షన్లో వస్తున్న నోకియా 1ను బడ్జెట్ ధరకే మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు HMD Global సర్వం సిద్ధం చేసింది. ఈ ఫోన్లో అన్ని రకాల గూగుల్ యాప్స్ ఉండే అవకాశం ఉంది. కాగా నోకియా బ్రాండ్ లలో వచ్చిన ఫోన్ల అన్నింటింకంటే ఈ ఫోన్ బెస్ట్ వర్షన్ పోన్ గా నిలుస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

కేవలం రూ. 2 వేలకే Samsung Galaxy S9, S9 plus బుకింగ్‌

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధర..

దీని ధరను కంపెనీ 85 అమెరికన్ డాలర్లకు (దాదాపుగా రూ.5,500) గా నిర్ణయించింది. వార్మ్ రెడ్, డార్క్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. అధికారికంగా ఈ ఫోన్ ఏప్రిల్ నెలలో వినియోగదారులకు లభ్యం కానుంది.

నోకియా 1 ఫీచర్లు

4.5 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్ ఓఎస్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2150 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఈ ఫోన్లతో పాటు..

ఈ ఫోన్లతో పాటు కంపెనీ Nokia 7 Plus, Nokia 8 Sirocco, Nokia 6 (2018) ఫోన్లను కూడా లాంచ్ చేసింది. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టంతో వచ్చాయి. వీటితో పాటు 4జీ ఫీచర్ ఫోన్ Nokia 8110 4Gను కూడా ఈ ఈవెంట్లో లాంచ్ చేసింది.

'నోకియా 8110 4జీ..

నోకియాకు చెందిన 3310 ఫీచర్ ఫోన్‌కు తోడుగా 'నోకియా 8110 4జీ' పేరిట వచ్చిన ఈ ఫోన్లో యూజర్లకు పలు ఆకట్టుకునే ఫీచర్లు లభిస్తున్నాయి. నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్‌లో 2.4 ఇంచుల కర్వ్‌డ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ కీబోర్డుపై స్లైడర్‌ రూపంలో ఓ కవర్‌ను అమర్చారు. దీన్ని కిందకు స్లైడ్ చేస్తే చాలు ఫోన్ కాల్ ఆటోమేటిక్‌గా లిఫ్ట్ అవుతుంది.

కాల్ మాట్లాడాక దాన్ని క్లోజ్ చేస్తే ..

స్లైడ్ ఓపెన్ అయి ఉన్నప్పుడు కాల్ మాట్లాడాక దాన్ని క్లోజ్ చేస్తే ఆటోమేటిక్‌గా కాల్ ఎండ్ అవుతుంది. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ కంపెనీకి చెందిన స్నాప్‌డ్రాగన్ 205 మొబైల్ ప్లాట్‌ఫాం చిప్‌సెట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 1.1 గిగాహెడ్జ్ సామర్థ్యం ఉన్న డ్యుయల్ కోర్ ప్రాసెసర్ ఉంది.

రూ.6,340 ధరకు..

ఈ ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్, గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఔట్‌లుక్, జీమెయిల్ యాప్స్, స్నేక్ గేమ్ యాప్‌లను ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు. నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్ ట్రెడిషనల్ బ్లాక్, బనానా ఎల్లో రంగుల్లో రూ.6,340 ధరకు మే నెలలో యూజర్లకు అందుబాటులోకి రానుంది.

నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్ ఫీచర్లు

2.4 ఇంచ్ క్యూవీజీఏ డిస్‌ప్లే, 320 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ స్నాప్‌డ్రాగన్ 205 ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, ఎక్స్‌పాండబుల్ మెమోరీ, డ్యుయల్ సిమ్, కాయ్ ఓఎస్, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), ఐపీ 52 డ్రిప్ ప్రొటెక్షన్, 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, యూఎస్‌బీ 2.0, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 1 Android Go Smartphone Launched at MWC 2018: Price, Specifications More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot