తక్కువ ధరతో నోకియా 1 వచ్చేసింది, ఆఫర్లే ఆఫర్లు బాసూ..

|

HMD Global బ్రాండ్ నోకియా ఇండియాలోకి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్‌తో దూసుకొచ్చింది. ఆండ్రాయిడ్ గో ఎడిషన్ లో తన తొలి స్మార్ట్‌ఫోన్ నోకియా 1ని లాంచ్ చేసింది. కాగా గత నెలలో బార్సిలోనియాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఈ ఫోన్ గురించి అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఇండియాలో ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ లో తొలి స్మార్ట్ ఫోన్ ఇదే. బడ్జెట్ ధరలో అదిరి ఫీచర్లతో ఆండ్రాయిడ్ ఈకో సిస్టంతో అలాగే తక్కువ బరువుతో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంటరయింది. కాగా గూగుల్ యాప్స్ , సర్వీసుతో పాటు జీమెయిల్, గూగుల్ మ్యాప్స్ గో లాంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. కాగా ఈ ఫోన్ యూజర్లకు మంచి అనుభూతిని అందించే విధంగా మలిచామని కంపెనీ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.5,499గా నిర్ణయించింది. ఇండియాలోని అన్ని అవుట్ లెట్లలో ఈ ఫోన్ లభ్యమవుతుందని కంపెనీ తెలిపింది. Dark Blue and Warm Red colour variantsలో ఈ ఫోన్ యూజర్ల చెంతకు వచ్చింది.

 

హైలెట్ ఫీచర్లతో ఇండియాకి ఒప్పో ఎఫ్7, ధర రూ. 21,990, డేటా ఆఫర్లు ఇవే !హైలెట్ ఫీచర్లతో ఇండియాకి ఒప్పో ఎఫ్7, ధర రూ. 21,990, డేటా ఆఫర్లు ఇవే !

నోకియా 1 ప్రత్యేకతలు

నోకియా 1 ప్రత్యేకతలు

4.5 అంగుళాల తాకే తెర
1.1గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌
1జీబీ ర్యామ్‌
5మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 2 మెగా పిక్సెల్‌ ముందు కెమెరా
8జీబీ అంతర్గత మెమొరీ
128జీబీ వరకూ మెమొరీ పెంచుకునే సామర్థ్యం
4జీ వీవో ఎల్‌టీఈ
2150 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

ధర రూ.5,499

ధర రూ.5,499

నోకియా 1 స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,499 ఉండగా దీనిపై జియో రూ.2200 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. దీంతో ఫోన్ ధర రూ.3,299 మాత్రమే అవుతుంది. కాకపోతే అందులో జియో సిమ్ వేసి యూజర్లు వాడాల్సి ఉంటుంది. ఇక దీంతోపాటు 60 జీబీ మొబైల్ డేటాను ఉచితంగా జియో అందిస్తున్నది.

 ఫోన్‌ను కొనేవారికి
 

ఫోన్‌ను కొనేవారికి

అలాగే ఫోన్‌ను కొనేవారికి 12 నెలల వాలిడిటీ ఉన్న ఉచిత యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్‌ను సర్విఫై అందిస్తున్నది. అయితే కస్టమర్లు కోటక్ 811సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో రూ.1000 జమ చేస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

మొదటి రైడ్‌కు 20 శాతం

మొదటి రైడ్‌కు 20 శాతం

ఇక ఈ ఫోన్‌ను కొన్నవారికి రెడ్‌బస్‌లో మొదటి రైడ్‌కు 20 శాతం డిస్కౌంట్‌ను కూడా అందిస్తున్నారు. గత వారం ఇదే ఓఎస్‌తో లావా జడ్50 లాంచ్ అవగా ఇప్పుడు నోకియా 1 అందుబాటులోకి వచ్చింది. నోకియా నుంచి విడుదలైన అత్యంత తక్కువ ధర కలిగిన 4జీ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం.

28 నుంచి..

28 నుంచి..

ఈ నెల 28 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రీటెయిల్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. కాగా నోకియా ఫోన్లు అంటేచే బ్యాటరీ బ్యాకప్ కు పెట్టింది పేరు.మరి ఈ ఫోన్ బ్యాటరీ బ్యాకప్  ఎలా ఉంటుందో చూడాలి. 

లావా తన దేశీయ తొలి ఆండ్రాయిడ్‌ ఓరియో..

లావా తన దేశీయ తొలి ఆండ్రాయిడ్‌ ఓరియో..

దేశీయ దిగ్గజం లావా తన దేశీయ తొలి ఆండ్రాయిడ్‌ ఓరియో(గో ఎడిషన్‌) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ చేస్తున్న 'మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌' ప్రొగ్రామ్‌లో భాగంగా జడ్‌50 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 10వేలకు పైగా రిటైల్‌ స్టోర్లలో, అదేవిధంగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటి ఆన్‌లైన్‌ ఛానళ్లలో అందుబాటులో ఉంచినట్టు లావా పేర్కొంది. ఈ లావా జడ్‌50 అసలు మార్కెట్‌ ఆపరేటింగ్‌ ధర 4,400 రూపాయలు. కాగా భారతీ ఎయిర్‌టెల్‌ మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌(నా తొలి స్మార్ట్‌ఫోన్‌) కార్యక్రమంలో భాగంగా ఈ ఫోన్ మీద రూ.2,000 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ అందిస్తోంది.

రూ. 4 వేల ధర..

రూ. 4 వేల ధర..

రూ. 4 వేల ధర మీద ట్యాగ్ అయిన్ ఈ ఫోన్ పై Airtel రూ.2000 క్యాష్‌బ్యాక్‌ ప్రకటించడంతో ఇప్పుడు ఈ ఫోన్ రూ.2,400కే యూజర్లకు లభిస్తోంది. అయితే కస్టమర్లు రూ.2000 క్యాష్‌బ్యాక్‌ పొందాలంటే, తొలి 18 నెలలు రూ.3500తో, 19 నుంచి 36 నెలల మరో రూ.3500తో తమ ఎయిర్‌టెల్‌ అకౌంట్లలో రీఛార్జ్‌ చేసుకోవాలి.

లావా జడ్‌50 స్పెషిఫికేషన్లు..

లావా జడ్‌50 స్పెషిఫికేషన్లు..

ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో(గో ఎడిషన్‌) 4.5 అంగుళాల డిస్‌ప్లే 2.5డీ కర్వ్‌డ్‌ గొర్రిల్లా గ్లాస్‌ క్వాడ్‌-కోర్‌ 1.1గిగాహెడ్జ్‌ మీడియాటెక్‌ ఎంటీ6737ఎం ఎస్‌ఓసీ 1జీబీ ర్యామ్‌, 8జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌ 5 మెగాపిక్సెల్‌ రియర్‌, ఫ్రంట్‌ కెమెరా సెన్సార్స్‌ 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్‌ స్పేస్..

1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్‌ స్పేస్..

ఈ జడ్‌50 స్మార్ట్‌ఫోన్‌లో 4.5 అంగుళాల డిస్‌ప్లే, 1.1 గిగాహెట్జ్‌ క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్‌ స్పేస్, 5 మెగా పిక్సెల్‌ రియర్, ఫ్రంట్‌ కెమెరా విత్‌ ఫ్లాష్‌ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొంది. ఈ ఫోన్‌ను రెండేళ్ల వారెంటీతో మార్కెట్‌లోకి వచ్చింది. లావా అదనంగా వన్‌టైమ్‌ స్క్రీన్‌ రిప్లేస్‌మెంట్‌ను కూడా ఆఫర్‌ చేస్తోంది. అయితే ఇది ఫోన్‌ కొనుగోలు చేసిన ఏడాది వరకే వాలిడ్‌లో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Nokia 1 Android Go Smartphone Launched in India: Price, Specifications More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X