అత్యంత తక్కువ ధరలో నోకియా 1, రెడీగా ఉండండి !

By Hazarath
|

మొబైల్ మార్కెట్లో దూసుకుపోయేందుకు కసరత్తులు చేస్తున్న హెచ్ఎండి గ్లోబల్ నోకియా సీరిస్ లో అత్యంత తక్కువ ధరతో మార్కెట్లోకి విడుదల చేయాలని కసరత్తు చేస్తోంది. రష్యాలోని టెక్ ఇండస్ట్రీలు ఈ ఫోన్‌కి సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేశాయి. లీకయిన రిపోర్టుల ప్రకారం నోకియా 1 మొదటగా రష్యా మార్కెట్లలో రిలీజ్ కానుంది. దీని ధర కూడా 5990 రూబెల్స్ గా ఉంటుందని అంచనా. అన్నీ కుదిరితో మార్చిలో ఈ ఫోన్ నోకియా అభిమానులను పలకరించే అవకాశం ఉంది.

 

జీరో ఛార్జింగ్ అయితే గెలాక్సీ నోట్ 8 ఫోన్లు ఇక పనిచేయవు !జీరో ఛార్జింగ్ అయితే గెలాక్సీ నోట్ 8 ఫోన్లు ఇక పనిచేయవు !

మిడ్ రేంజ్‌, హై రేంజ్ స్మార్ట్‌ఫోన్లు మాత్ర‌మే..

మిడ్ రేంజ్‌, హై రేంజ్ స్మార్ట్‌ఫోన్లు మాత్ర‌మే..

నోకియాలో ఇప్పటివరకు మిడ్ రేంజ్‌, హై రేంజ్ స్మార్ట్‌ఫోన్లు మాత్ర‌మే మార్కెట్లో సందడి చేశాయి. ఈ నేపథ్యంలోనే నోకియా 2 వచ్చినా అది మ‌రీ అంత త‌క్కువ బ‌డ్జెట్ ఫోన్ మాత్రం కాదని చెప్పవచ్చు.

 తక్కువ ధరలో నోకియా 1 ..

తక్కువ ధరలో నోకియా 1 ..

అయితే ఇప్పుడు నోకియాలో అత్యంత తక్కువ ధరలో నోకియా 1 స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ తన నూతన బడ్జెట్ 4జీ స్మార్ట్‌ఫోన్ నోకియా 1ను త్వరలో విడుదల చేయనుందనే వార్తలు వస్తున్నాయి.

లీకయిన సమాచారం ప్రకారం..
 

లీకయిన సమాచారం ప్రకారం..

లీకయిన సమాచారం ప్రకారం 5 ఇంచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 212 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో (గో ఎడిషన్), 4జీ వీవోఎల్‌టీఈ, 4000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీ వంటి ఫీచర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 వచ్చే ఏడాది మార్చిలో..

వచ్చే ఏడాది మార్చిలో..

ఈ ఫోన్‌ను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేసే అవకాశం ఉండగా దీని ధర రూ.5 వేల నుంచి రూ.6వేల మధ్య ఉంటుందని సమాచారం.

 

 

Best Mobiles in India

English summary
Nokia 1 will be launched as an entry-level Android Go smartphone in first half of 2018, say reports More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X