నోకియా మోటరోలా మద్య 'సెగ' అలా మొదలైంది....

Posted By: Staff

నోకియా మోటరోలా మద్య 'సెగ' అలా  మొదలైంది....

మార్కెట్లో ఒక కంపెనీ మొబైల్ తయారీదారు ఏదైనా మొబైల్‌ని విడుదల చేశారంటే సరిగ్గా అలాంటి ఫీచర్సే ఉన్న మరో మొబైల్‌‌‌ని వేరే తయారీదారు చేయడం మామూలే. ఐతే ఈ రెండింటిలో ఏది బెస్టో యూజర్స్ తెలుసుకొవడం కాస్త కష్టం కాబట్టి. యాజర్స్‌కు ఎటువంటి మొబైల్ ఐతే సరిగ్గా సరిపోతుందో రెండింటిని సరిచూడడం వల్ల వెంటనే మనకు తెలిసిపోతుంది. నోకియా 101, మోటరోలా ఈఎక్స్ 109 రెండు మొబైల్స్ పీచర్స్‌ని క్లుప్తంగా తెలుసుకుందాం. నోకియా 101 ‌మొబైల్‌ని క్లాసీ విభాగంలో విడుదల చేయగా, మోటరోలా ఈఎక్స్ 109 మొబైల్‌ని బిజినెస్ క్లాసీ విభాగంలో విడుదల చేయడం జరిగింది.

నోకియా 101చూడడానికి ఆర్డినరి ఫోన్ మాదిరే ఉన్నప్పటికీ హై ఎండ్ ఫీచర్స్ దీని సొంతం. నోకియా 101 మొబైల్ 128 X 160 ఫిక్సల్ డిస్ ప్లేతో పాటు 1.8 ఇంచ్ స్క్రీన్ సైజుని కలిగి ఉంది. అదే మోటరోలా ఈఎక్స్ 109 విషయానికి వస్తే 176 X 220 ఫిక్సల్‌ని సపోర్ట్ చేస్తుంది. నోకియా 101 మొబైల్ ఫోన్ బుక్లో 500 ఎంట్రీలను ఇమడింపచేసకోవచ్చు. దీనితో పాటు ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 16జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. మోటరోలా ఈఎక్స్ 109 మొబైల్ ఫోన్‌తో పాటు 50 ఎమ్‌బి మొమొరీ లభిస్తుండగా ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని విస్తరించుకోవచ్చు.

నోకియా 101 మొబైల్ ఫోన్‌లో కెమెరా లేకపోవడం యూజర్స్‌ని నిరాశకు గురిచేసే అంశం. మోటరోలా ఈఎక్స్ 109లో మాత్రం 2 మెగా ఫిక్సల్ ఉండడంతో చక్కని ఫోటోలను తీయవచ్చు. డేటాని ట్రాన్పర్ చేసుకునేందుకు గాను ఇందులో కనెక్టివిటీ ఫీచర్ బ్లూటూత్ ఫీచర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. కానీ నోకియా 101 మాత్రం డ్యూయల్ సిమ్‌లను సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు నోకియా 101లో ఎఫ్‌ఎమ్ రేడియో, గ్యాలరీ, ఎమ్‌పి3 ప్లేయర్ ప్రత్యేకం. మోటరోలా ఈఎక్స్ 109 మొబైల్ ఫోన్‌లో జిపిఆర్‌ఎస్, ఎడ్జి టెక్నాలజీలు ఉండడంతో ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ని కూడా ఈజీగా చేసుకోవచ్చు. మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం.

రెండు మొబైల్స్ కూడా మార్కెట్లో లభించే అన్ని రకాల ఆడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తాయి. రెండు మొబైల్స్ తయారీదారులు కూడా బ్యాటరీ పవర్ విషయంలో రాజీపడని విషయం తెలిసిందే. మోటరోలా ఈఎక్స్ 109 మొబైల్ ధర మార్కెట్లో సుమారుగా రూ 3,590గా నిర్ణయించగా, నోకియా 101 మొబైల్ పోన్ ధరని ఇంకా వెల్లడించలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot