దరువుకు ‘సై’...!

Posted By: Super

 దరువుకు ‘సై’...!

 

విశ్వసనీయ బ్రాండ్ నోకియా ప్రముఖ విశిష్టతలతో కూడిన రెండు ఫీచర్ ఫోన్‌లను తాజాగా రూపొందించింది. వీటి పేర్లు నోకియా 110, నోకియా 112. మార్కెట్‌ను శాసించేందకు సిద్ధంగా ఈ హ్యాండ్‌సెట్‌ల కీలక ఫీచర్లు అదేవిధంగా పనితీరు:

నోకియా 110:

డ్యూయల్ సిమ్,

1.8 అంగుళాల స్ర్కీన్,

0.3 మెగాపిక్సల్ రేర్ కెమెరా,

64ఎంబీ ఇంటర్నల్ మెమెరీ,

స్టాండర్డ్ Li-ion 1020 mAh బ్యాటరీ (స్టాండ్‌బై 637 గంటలు, టాక్‌టైమ్ 10.5 గంటలు),

బ్లూటూత్ 2.1 వర్షన్,

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్.

బరువు 2.82 ఔన్సులు.

నోకియా 112:

డ్యూయల్ సిమ్,

1.8 అంగుళాల స్ర్కీన్,

0.3 మెగాపిక్సల్ రేర్ కెమెరా,

64ఎంబీ ఇంటర్నల్ మెమెరీ,

స్టాండర్డ్ Li-ion 1020 mAh బ్యాటరీ (స్టాండ్ బై 637 గంటలు, టాక్ టైమ్ 10.5 గంటలు),

బ్లూటూత్,

మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్.

బరువు 3.03oz.

ఈ బార్ స్టైల్ ఫోన్‌లు ఇంటర్నల్ యాంటీనాను కలిగి ఉంటాయి. జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి. నిక్షిప్తం చేసిన జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ ఫీచర్లు ఇంటర్నెట్ బ్రూజింగ్‌కు ఉపకరిస్తాయి. ఏర్పాటు చేసిన కెమెరా వ్యవస్థ ఉత్తమమైన డిజిటల్ జూమ్‌ను కలిగి ఉంటుంది. హ్యాండ్‌సెట్‌లలోని ఇంటర్నల్ మెమెరీ 64ఎంబీ కాగా మైక్రోఎస్డీ కార్డ్ సౌలభ్యతతో మెమెరీ సామర్ధ్యాన్ని మరింత పెంచుకునే అవకాశాన్ని కల్పించారు. లోడ్ చేసిన ఆడియో అదేవిధంగా వీడియో ప్లేయర్ క్వాలిటీ వినోదాలను చేరువచేస్తుంది. డి-ప్యాడ్ వంటి ఉత్తమ నావిగేషన్

ఫీచర్‌ను ఈ డివైజుల్లో ఇన్‌బుల్ట్ చేశారు. బ్లూటూత్ కనెక్టువిటీ డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. నోకియా 110 స్టాండర్డ్ బ్లాక్ కలర్ వేరియంట్‌లో లభ్యంకానుంది. నోకియా 112 బ్లాక్, వైట్, బ్లూ ఇంకా రెడ్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది ఈ ఫోన్‌ల విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం లేదు. ధర వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot