ఈ ఫోన్ సేల్స్ రికార్డు తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు.. మరీ అన్ని కోట్లా.. ఆ ఫోన్ అంత స్పెషల్ ఏంటి?
ఇప్పుడంటే అత్యాధునిక టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా మెరుగైన కెమెరా, ఆకట్టుకొనే డిజైన్‌లతో విడుదల అవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ను కేవలం కాలింగ్, డేటా అవసరాలకే కాకుండా బ్యాంకింగ్ సహా ఇతర పనుల కోసమూ ఉపయోగపడుతోంది. అదే గతంలో అంటే ఓ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లండి. ఆ సమయంలో మీరు ఏ ఫోన్ వినియోగించారు అని అడిగితే అధిక శాతం మంది నోకియా ఫోన్ అని చెప్పారు.
అప్పట్లో అంత ఫేమస్! :
నోకియా బ్రాండ్ (Worlds Best Selling Phone) అంటే అంత ఫేమస్ అప్పట్లో మరి. అయితే క్రమంగా నోకియా బ్రాండ్ పాపులారిటీ కోల్పోయింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అభివృద్ధి చెందాక.. నోకియా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆపిల్, శాంసంగ్ సహా చైనాకు చెందిన అనేక సంస్థలు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న బ్రాండ్‌లుగా చలామణి అవుతున్నాయి.

ప్రపంచ రికార్డు :
ఇటీవల సేల్స్ రికార్డుల్లోనూ ఆపిల్, శాంసంగ్, రెడ్‌మి వంటి సంస్థలు అగ్రస్థానాల్లో ఉంటున్నాయి. అయితే తాజాగా అందుబాటులోకి వచ్చిన ఓ వార్త మిమ్మల్ని కచ్చితంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. విక్రయాల్లో ఆపిల్, శాంసంగ్ సహా ఇతర బడా సంస్థలను వెనక్కి నెట్టి ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది.
అత్యధికంగా కొనుగోలు చేసిన ఫోన్ ఏంటో ?
ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల ఫోన్‌లు విక్రయించారు. అయితే అత్యధికంగా కొనుగోలు చేసిన ఫోన్ ఏంటో ఎప్పుడైనా తెలుసుకోవాలని అనిపించిందా..? ఆ ప్రశ్నకు తాజాగా సమాధానం దొరికింది. ఆ ఫోనే 'నోకియా 1100' (Nokia 1100). ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 250 మిలియన్ (25 కోట్లు) యూనిట్‌లు విక్రయాలు జరిగాయి.
రెండో స్థానంలోనూ నోకియా ఫోనే ఉంది. 248 మిలియన్ యూనిట్ విక్రయాలతో నోకియా 1110 (Nokia 1110) ఉంది. మూడో స్థానంలో ఐఫోన్ 6/6 ప్లస్ ఫోన్‌లు ఉన్నాయి. ఈ ఫోన్ 222 మిలియన్ యూనిట్ల విక్రయాలు నమోదు చేసింది. నాలుగో స్థానంలో మళ్లీ నోకియా 105 ఫోన్ (Nokia 105) నిలిచింది. ఈ ఫోన్ 200 మిలియన్ యూనిట్లు విక్రయాలు జరిగాయి. ఐఫోన్ 6S/ 6S ప్లస్ ఫోన్‌లు 174 మిలియన్ యూనిట్ల విక్రయాలతో ఐదో స్థానంలో నిలిచింది.
మార్కెట్‌లో టాప్ :
స్మార్ట్‌ఫోన్లు వచ్చేంత వరకు నోకియా సంస్థ మార్కెట్‌లో టాప్‌లో నిలిచింది. నోకియా 1100 మోడల్‌ను 2023 నుంచి 2008 వరకు ఉత్పత్తి చేస్తూనే ఉంది. ఈ ఫోన్ ద్వారానే నోకియా వందల కోట్ల ఆదాయం సంపాదించింది. ఆకట్టుకొనే డిజైన్, బ్యాటరీ లైఫ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. వీటితోపాటు టార్చ్ లైట్, స్నేక్ గేమ్ సహా మరిన్ని ఫీచర్‌లను కలిగి ఉండేది.
ఫలితంగా సెల్‌ఫోన్‌ల ప్రారంభంలో నోకియా 1100 ఫోన్ చక్రం తిప్పింది. వీటితోపాటు నోకియా 1110, నోకియా 105 వంటి మోడళ్లు కూడా మార్కెట్‌లో నోకియాను తిరుగులేని శక్తిగా మార్చాయి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు అగ్రస్థానంలో ఉన్నా.. వృద్ధులు సహా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఫీచర్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. వారిలో ఇప్పటికీ చాలా మంది నోకియా ఫోన్‌లను కలిగి ఉన్నారు.
ప్రస్తుతం ప్రతి సంవత్సరం విడుదల అవుతున్న సేల్స్ రికార్డుల ఆధారంగా ఆపిల్ ఫోన్‌లు తొలి స్థానంలో నిలుస్తున్నాయి. అనంతరం శాంసంగ్, రెడ్‌మి బ్రాండ్‌లు ఉంటున్నాయి. భారత్ మార్కెట్‌లో ఎంట్రీ లెవల్ ధర సెగ్మెంట్ నుంచి ఫ్లాగ్‌షిప్ మోడళ్లు వరకు భారీ డిమాండ్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థలకు భారత్ కీలక మార్కెట్‌గా ఉంది.


Click it and Unblock the Notifications








