మార్కెట్లోకి ‘నోకియా 114’

Posted By: Super

 మార్కెట్లోకి ‘నోకియా 114’

 

శ్వసనీయ మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా ‘నోకియా 114’ పేరుతో సరికొత్త డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ నోకియా ఇండియా, ఈ డివైజ్‌ను తన లిస్టింగ్స్‌లో ఉంచింది. కీలక స్పెసిఫికేషన్‌లు:

బరువు ఇంకా చుట్టుకొలత: 80 గ్రాములు, 110 x 46 x 14.8మిల్లీ మీటర్లు,

డిస్‌ప్లే: 1.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, రిసల్యూషన్ 128 x 160పిక్సల్స్,

స్టోరేజ్: 16ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, 64ఎంబి మాస్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు.

కెమెరా: 0.3 మెగాపిక్సల్ వీజీఏ రేర్ కెమెరా,

ఆపరేటింగ్ సిస్టం: నోకియా సిరీస్ 40 ప్లాట్‌ఫామ్,

కనెక్టువిటీ: డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 2.1, జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్,

బ్యాటరీ: 1020 ఎమ్ఏహెచ్ బీఎల్-5సీ బ్యాటరీ (టాక్‌టైమ్ 10.5గంటలు, స్టాండ్‌బై 637 గంటలు),

అదనపు ఫీచర్లు: ట్విట్టర్ సర్వీస్, ఫేస్‌బుక్ సర్వీస్, విండోస్ లైవ్ మెసెంజర్, నోకియా చాట్, ఈజీ స్వాప్ ఫీచర్.

ధర: రూ.2,500.

‘నోకియా 109’తో పోలిస్తే ఉత్తమ ఎంపికే..?

నోకియా ఇటీవల ఆవిష్కరించిన ‘నోకియా 109’తో పోలిస్తే ‘నోకియా 114’ ఉత్తమ ఎంపికని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నోకియా 109 ఫీచర్లను పరిశీలిస్తే......

1.8 అంగుళాల

టీఎఫ్టీ డిస్‌ప్లే రిసల్యూషన్ 128 x 160పిక్సల్స్, 16ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, నోకియా సిరీస్ 40 ప్లాట్‌ఫామ్, జీపీఆర్ఎస్/ఎడ్జ్ 2జీ, 800ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (7.5 గంటల టాక్‌టైమ్, 790 గంటల స్టాండ్‌బై), బ్లాక్ ఇంకా సియాన్ కలర్ వేరియంట్స్. నోకియా 109 ఈ ఏడాది చివరి నుంచి మార్కెట్లో లభ్యం కానుంది. ధర అంచనా రూ.2,250.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot