46 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌తో ‘నోకియా 130’

ప్రత్యేకమైన ఇన్‌బుల్ట్ మ్యూజిక్ ప్లేయర్ ఆప్షన్‌తో కూడిన ‘నోకియా 130' డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్‌ను మైక్రోసాఫ్ట్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ప్రారంభ స్థాయి ఫీచర్ ఫోన్ ధర రూ.1649. ఈ ఫోన్ బ్యాటరీని ఒకసారి పూర్తిగా చార్జ్ చేసినట్లయితే 13 గంటల పాటు నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చని, ఫోన్‌ను వినియోగించనట్లయితే 36 రోజులు పాటు చార్జింగ్ అలానే ఉంటుందని, మ్యూజిక్ ప్లేయర్‌తో 46 గంటల పాటు మ్యూజిక్‌ను , 16 గంటల పాటు వీడియోలను వీక్షించవచ్చని కంపెనీ తెలిపింది.
నోకియా 130 కీలక ఫీచర్లు:
1.8 అంగుళాల కలర్ డిస్‌ప్లే,
ఫోన్ మెమరీని మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
బ్లూటూత్ కనెక్టువిటీ,
యూఎస్బీ కనెక్టువిటీ ద్వారా ఫైల్స్‌ను షేర్ చేసుకునే అవకాశం.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








