నోకియా కొత్త ఫోన్ విడుదలైంది, ధర రూ.1950
భారత్‌లో మాత్రం డ్యుయల్ సిమ్ వేరియంట్‌ను మాత్రమే అందుబాటులో ఉంచారు.
HMD Global నుంచి డిసెంబర్, 2016లో ప్రపంచానికి పరిచయమైన ఎంట్రీ లెవల్ నోకియా ఫీచర్ ఫోన్ నోకియా 150 డ్యుయల్, ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ధర రూ.1950. నోకియా 150 ఫోన్ కు సంబంధించి సింగిల్ సిమ్ వేరియంట్‌ను కూడా హెచ్‌ఎండి గ్లోబల్ లాంచ్ చేసినప్పటికి, భారత్‌లో మాత్రం డ్యుయల్ సిమ్ వేరియంట్‌ను మాత్రమే అందుబాటులో ఉంచారు.
Read More : జియో ప్రైమ్ ఉచితం.. అలా చేయండి, ఇలా తీసుకోండి

ఎంపీ3 ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో..
నోకియా నుంచి లాంచ్ అయిన ఈ సరికొత్త బేసిక్ హ్యాండ్‌సెట్‌లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉండదు. ఎంపీ3 ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, బ్లుటూత్ వీ3.0 విత్ స్లామ్, వీజీఏ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్ వంటి ప్రత్యేకతలు ఉంటాయి.

నోకియా 150 డ్యుయల్ స్పెసిఫికేషన్స్..
2.5 అంగుళాల QVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 240x320పిక్సల్స్)తో వస్తోన్న ఈ హ్యాండ్‌సెట్‌లు నోకియా సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి. డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని కల్పించారు. ఫోన్ బరువు (బ్యాటరీతో కలుపుకుని 81 గ్రాములు.)

బ్యాటరీ బ్యాకప్
1020 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోన్న ఈ ఫోన్ 22 గంటల టాక్‌టైమ్ అలానే 31 రోజులు స్టాండ్‌బై టైమ్‌ను ఆఫర్ చేయగలదని నోకియా చెబుతోంది. స్టాండర్డ్ మైక్రయూఎస్బీ చార్జర్ ద్వారా ఈ ఫోన్ ను ఛార్జ్ చేసుకోవచ్చు.

పాపులర్ గేమ్స్..
Snake Xenzia, Nitro Racing వంటి పాపులర్ గేమ్స్ ఈ ఫోన్‌లలో అందుబాటులో ఉంటాయని కంపెనీ చెబుతోంది.

ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే..
మైక్రోసాఫ్ట్ కంపెనీ నోకియా బ్రాండ్ హక్కులను హెచ్‌ఎండీ గ్లోబల్‌కు విక్రయించిన విషయం తెలిసిందే. వచ్చే పదేళ్ల పాటు నోకియా బ్రాండ్ ఫోన్లు, టాబ్లెట్లు తయారు చేసేందుకు హెచ్‌ఎండి గ్లోబల్ లిమిటెడ్‌కు అంతర్జాతీయ లైసెన్సును, ఐపిఆర్ హక్కులను మైక్రోసాఫ్ట్ నుంచి హెచ్‌ఎండీ గ్లోబల్ సొంతం చేసుకుంది. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో భాగంగా నోకియా 3, నోకియా 5, నోకియా 6 మోడల్స్‌లో ఆండ్రాయిడ్ నౌగట్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఐకానిక్ 3310 ఫోన్‌ను కూడా హెచ్‌ఎండీ గ్లోబల్ విడుదల చేసింది. ఈ ఫోన్‌లు త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నాయి.


Click it and Unblock the Notifications








