నోకియా నుంచి సైలెంట్‌గా 3 స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి

హెచ్ఎండి గ్లోబల్ నోకియా ఇండియాలో ఒకేసారి మూడు స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.

|

హెచ్ఎండి గ్లోబల్ నోకియా ఇండియాలో ఒకేసారి మూడు స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. నోకియా 2.1, నోకియా 3.1(న్యూ వేరియంట్‌), నోకియా 5.1 పేర్లతో మూడు డివైస్‌లను ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. పేటీఎం మాల్‌ సహా ఇతర రీటైలర్స్‌తో పాటు ఆగస్టు 12 నుంచి ఇవి విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో వస్తున్న ఈ డివైస్‌లు అతి త్వరలోనే రానున్నఆండ్రాయిడ్‌ 9 తో అప్‌గ్రేడ్‌ అవుతాయని కంపెనీ వాగ్దానం చేసింది. మోస్ట్‌ ప్రీమియం వెర్షన్‌గా నోకియా 5.1ను, ఎంట్రీ లెవల్‌ సెగ్మెంట్‌లో నోకియా 2.1 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. అయితే నోకియా 3.1లో 3జీబీ వేరియంట్‌ను విడుదల చేసింది. ఫీచర్ల విషయానికొస్తే..

 

యాప్ ద్వారా పర్సనల్ లోన్ పొందండం ఎలా ?యాప్ ద్వారా పర్సనల్ లోన్ పొందండం ఎలా ?

నోకియా 5.1 ఫీచర్లు

నోకియా 5.1 ఫీచర్లు

ధర రూ. 14,499
5.5ఫుడ్‌ హెచ్‌డీ డిస్‌ప్లే,18: 9 రేషియో, 2160 x 1080 పిక్సల్స్,ఆక్టా-కోర్ మీడియా టెక్ హెల్లియో పి 18 ప్రాసెసర్‌,3జీబీర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌,16ఎంపీ రియర్‌ కెమెరా,8ఎంపీ సెల్ఫీ కెమెరా,3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్ ఓరియో

నోకియా 3.1 ఫీచర్లు

నోకియా 3.1 ఫీచర్లు

ధర: రూ. 11,999
5.2-అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే,1440 x 720 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌,మీడియా టెక్ 6750 చిప్సెట్,3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌,13 ఎంపీ రియర్‌ కెమెరా,8ఎంపీ సెల్ఫీ కెమెరా,2990 ఎంఏహెచ్‌ బ్యాటరీ,ఆండ్రాయిడ్ ఓరియో

నోకియా 2.1 ఫీచర్లు
 

నోకియా 2.1 ఫీచర్లు

ధర : రూ. 6999
5.5-అంగుళాల డిస్‌ప్లే.క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 425 చిప్‌సెట్‌,720x1280 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌,1జీబీ ర్యామ్‌,8 జీబీ స్టోరేజ్‌,8 మెగాపిక్సల్ రియర్‌ కెమెరా,5ఎంపీ సెల్పీ కెమెరా,4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ,ఆండ్రాయిడ్ ఓరియో

నోకియా 6 (2018)

నోకియా 6 (2018)

2018కిగాను హెచ్ఎండి గ్లోబల్ తన మొదటి నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. 2017లో లాంచ్ అయిన నోకియా 6తో పోలిస్తే నోకియా 6 (2018) మోడల్ శక్తివంతమైన ఇంటర్నల్ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.

360 డిగ్రీ ఓజో ఆడియో

360 డిగ్రీ ఓజో ఆడియో

360 డిగ్రీ ఓజో ఆడియో, డ్యుయల్ సైట్ కెమెరా వంటి విప్లవాత్మక ఫీచర్లు ఈ కొత్త వర్షన్‌లో యాడ్ అవటంతో నోకియా 6 (2018) మోడల్ అమ్మకాలు మార్కెట్లో బాగా దూసుకువెళుతున్నాయి.

ధర

ధర

నోకియా 6 (2018) వర్షన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 4జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ (ధర రూ.14,600), 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ (ధర రూ.15,999).

నోకియా 6 (2018) స్పెసిఫికేషన్స్...

నోకియా 6 (2018) స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి స్టోరేజ్ వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఫేస్‌ డిటెక్షన్ ఆటో ఫోకస్, ఎఫ్ 2.0 అపెర్చుర్, డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

నోకియా 6 (2017) స్పెసిఫికేషన్స్...

నోకియా 6 (2017) స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

నోకియా 9

నోకియా 9

కాగా హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా 9 స్మార్ట్‌ఫోన్‌ను అతి త్వరలో విడుదల చేయనుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ముందుగా అనుకున్నట్టు నోకియా 8ను ఫ్లాగ్‌షిప్ మోడల్‌లో కాకుండా నోకియా 9 ఫోన్‌నే ఫ్లాగ్‌షిప్ మోడల్‌లో హెచ్‌ఎండీ గ్లోబల్ విడుదల చేయనుందని తెలిసింది. దీంతో నోకియా 9 స్మార్ట్‌ఫోనే హెచ్‌ఎండీ గ్లోబల్ నుంచి వస్తున్న మొదటి ఫ్లాగ్‌షిప్ ఫోన్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ఈ ఫోన్‌లో ఫీచర్లు ఇలా ఉండనున్నాయి.

 నోకియా 9 లీకైన ఫీచర్లు

నోకియా 9 లీకైన ఫీచర్లు

నోకియా 9 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు నెట్‌లో లీకైన వాటిని బట్టి చూస్తే ఈ ఫోన్‌లో 5.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నట్టు తెలిసింది. ఇక ఈ ఫోన్ ధర రూ.44వేల నుంచి రూ.55వేల మధ్యలో ఉంటుందని సమాచారం..!

Best Mobiles in India

English summary
Nokia 2.1, Nokia 5.1, Nokia 3.1 3GB RAM Variant Launched in India: Price, Specifications more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X