Nokia 2.4 & 3.4 కొత్త ఫోన్‌ల ఫీచర్స్ & ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి

|

ప్రముఖ హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ ఇండియాలో నోకియా 2.4, నోకియా 3.4 ఫీచర్ ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ నోకియా ఫీచర్ ఫోన్లను ఇండియాలో నవంబర్ 26 న లాంచ్ కానున్నాయి. ఈ రెండు నోకియా ఫోన్లు సెప్టెంబరులో ప్రపంచ మార్కెట్లో అధికారికంగా విడుదల అయ్యాయి. అదే గ్లోబల్ మోడల్స్ ఇప్పుడు భారత మార్కెట్లోకి వస్తాయని భావిస్తున్నారు. రాబోయే నోకియా ఫోన్‌ల యొక్క ఇండియా ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నోకియా కొత్త ఫోన్‌ల ఇండియా లాంచ్ టీజర్ వివరాలు
 

నోకియా కొత్త ఫోన్‌ల ఇండియా లాంచ్ టీజర్ వివరాలు

హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ నోకియా ఫోన్‌ల లాంచ్ డేట్ వివరాలను తన యొక్క అధికారిక ట్విట్టర్‌ అకౌంటులో విడుదల చేసింది. ఈ ట్వీట్ నోకియా మొబైల్ ఇండియా యొక్క అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి విడుదల చేసింది. ఈ ట్వీట్ లో విడుదల చేసిన టీజర్ వీడియోలో నోకియా కొత్త ఫోన్ల లాంచ్ కు కేవలం 10 రోజులు మాత్రమే ఉంది అని పేర్కొంది. రెండు బడ్జెట్ నోకియా ఫోన్‌లను దేశంలో నిర్ణీత తేదీన ప్రకటించనున్నట్లు ట్వీట్‌లో స్పష్టమైంది. అయితే ఈ ట్వీట్ నోకియా డివైస్ల పేరును ప్రస్తావించలేదు.

Also Read: Samsung Galaxy S20 + BTS ఎడిషన్ ఫోన్‌ మీద రూ.10,000 భారీ ధర తగ్గింపు

నోకియా కొత్త ఫోన్‌ల ధరల వివరాలు

నోకియా కొత్త ఫోన్‌ల ధరల వివరాలు

గ్లోబల్ మార్కెట్లోని ధరల ప్రకారం నోకియా 2.4 యొక్క US ధర $139 గా ఉంది. ఇది ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ.10,400 గా ఉంది. అలాగే నోకియా 3.4 యొక్క US ధర 179 డాలర్లు. ఇండియా కరెన్సీలో దీని విలువ సుమారు రూ.13,400 గా ఉంది. నోకియా 3.4 ఫోన్ చార్‌కోల్, ఫ్జోర్డ్, మరియు డస్క్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. అలాగే నోకియా 2.4 ఫోన్ చార్‌కోల్, డస్క్ మరియు ఫ్జోర్డ్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. అదే మోడళ్లు భారత మార్కెట్‌లోకి కూడా వస్తాయని ఆశించవచ్చు.

నోకియా 2.4 ఫీచర్ ఫోన్ స్పెసిఫికేషన్

నోకియా 2.4 ఫీచర్ ఫోన్ స్పెసిఫికేషన్

నోకియా 2.4 ఫీచర్ ఫోన్ యొక్క డిస్ప్లే 21: 9 కారక నిష్పత్తితో 6.5-అంగుళాల హెచ్‌డి స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. దీని యొక్క స్క్రీన్ పైభాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ కలిగి ఉంటుంది. ఈ నోకియా ఫోన్ వెనుక భాగంలో 13MP మెయిన్ సెన్సార్ మరియు 2MP డీప్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 5MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ AI ఇమేజింగ్, నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్ మరియు పోస్ట్-క్యాప్చర్ ఎడిటింగ్‌ వంటి పలురకాల కెమెరా ఫీచర్లను అందిస్తుంది.

నోకియా 2.4 ఫీచర్ ఫోన్ మీడియాటెక్ హెలియో P22 ప్రాసెసర్ ఫీచర్స్
 

నోకియా 2.4 ఫీచర్ ఫోన్ మీడియాటెక్ హెలియో P22 ప్రాసెసర్ ఫీచర్స్

నోకియా 2.4 ఫోన్ యొక్క ఇతర ఫీచర్లలో మీడియాటెక్ హెలియో P22 ప్రాసెసర్, 2GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్, 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, మైక్రో SD పోర్ట్, ఆండ్రాయిడ్ 10, అంకితమైన గూగుల్ అసిస్టెంట్ వంటివి మరిన్ని ఉన్నాయి. నోకియా 2.4 ను ఆండ్రాయిడ్ 11 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కు అప్‌గ్రేడ్, రెండేళ్లపాటు ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, మూడేళ్లపాటు సెక్యూరిటీ ప్యాచ్‌లు లభిస్తాయని హెచ్‌ఎండి ధృవీకరించింది.

Also Read: JioPhone వార్షిక ఆల్ ఇన్ వన్ ప్లాన్‌ల ప్రయోజనాలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి...

నోకియా 3.4 ఫీచర్ ఫోన్ స్పెసిఫికేషన్

నోకియా 3.4 ఫీచర్ ఫోన్ స్పెసిఫికేషన్

నోకియా 2.4 తో పోల్చినప్పుడు నోకియా 3.4 హై-ఎండ్ వెర్షన్ గా వస్తుంది. ఈ నోకియా 3.4 ఫోన్ డిస్ప్లే 6.39 అంగుళాల హెచ్‌డి + స్క్రీన్‌తో పంచ్-హోల్ డిజైన్ తో వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 13MP ప్రైమరీ సెన్సార్, 5MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2MP డెప్త్ సెన్సార్ లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. అలాగే ముందు భాగంలో 8MP సెన్సార్‌తో కెమెరాను కలిగి ఉంటుంది.

నోకియా 3.4 ఫీచర్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్‌ ఫీచర్స్

నోకియా 3.4 ఫీచర్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్‌ ఫీచర్స్

నోకియా 3.4 ఫీచర్ ఫోన్ క్వాల్‌కామ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్‌తో రన్ అవుతూ 3GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని మరింత విస్తరించడానికి అవకాశం ఉంది. ఫోన్ యొక్క వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అమర్చబడి ఉంది. ఇది అంకితమైన గూగుల్ అసిస్టెంట్ బటన్, 4000mAh బ్యాటరీ, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB-C పోర్ట్ మరియు ఎన్‌ఎఫ్‌సి సపోర్ట్ కూడా ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Nokia 2.4 and Nokia 3.4 Feature Phones India Launch on November 26

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X