నోకియా 2 వచ్చేసింది, ధర రూ. 6,999 మాత్రమే, 2 రోజుల బ్యాటరీ బ్యాకప్..

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 2ను గత నెలలో ప్రకటించిన విషయం విదితమే.

By Hazarath
|

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 2ను గత నెలలో ప్రకటించిన విషయం విదితమే. కాగా ఇప్పుడీ ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. రేపటి నుంచి ఈ ఫోన్ ఇండియాలో అమ్మకానికి రానుంది. అయితే ఈ ఫోన్ ధర ఇండియాలో ఎంత ఉంటుందనే విషయం మీద అనేక తర్జనభర్జనలు జరిగాయి. అయితే ఈ ఊహాగానాలన్నింటికి తెరదించుతూ కంపెనీ దీని ధరను ఇండియాలో రూ. 6,999గాప్రకటించింది.

ఉబర్‌కి షాకిచ్చిన హ్యాకర్లు.. రూ. 65 కోట్లు చెల్లింపుఉబర్‌కి షాకిచ్చిన హ్యాకర్లు.. రూ. 65 కోట్లు చెల్లింపు

నోకియా 2 ఫీచర్లు

నోకియా 2 ఫీచర్లు

5 ఇంచ్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 212 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 52 స్ప్లాష్ ప్రూఫ్ టెక్నాలజీ, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ.

పూర్తిగా పాలీ కార్బనేట్‌..

పూర్తిగా పాలీ కార్బనేట్‌..

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్కి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. కాగా ఈ ఫోన్ పూర్తిగా పాలీ కార్బనేట్‌తో తయారుకావడంతో పాటు అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది.

ఐపీ 52 స్ప్లాష్ ప్రూఫ్ టెక్నాలజీ

ఐపీ 52 స్ప్లాష్ ప్రూఫ్ టెక్నాలజీ

మరో అదనపు ఆకర్షణ ఐపీ 52 స్ప్లాష్ ప్రూఫ్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ ద్వారా ఫోన్ ఎటువంటి నీటి ప్రభావానికి లోను కాదు. ఫోన్‌పై నీరు పడినా అది నిలవదు వెంటనే ఫోన్ నుంచి బయటకు వచ్చేస్తుంది.

 మెమొరీ కార్డుకు డెడికేటెడ్ స్లాట్

మెమొరీ కార్డుకు డెడికేటెడ్ స్లాట్

ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మెమొరీ కార్డుకు డెడికేటెడ్ స్లాట్ ఇచ్చినందున ఒకేసారి రెండు సిమ్ కార్డులతోపాటు మెమొరీ కార్డును కూడా వేసుకోవచ్చు.

జియో 45 జీబీ అదనపు డేటా

జియో 45 జీబీ అదనపు డేటా

నోకియా 2 స్మార్ట్‌ఫోన్‌పై రిలయన్స్ జియో 45 జీబీ అదనపు డేటాను అందిస్తున్నది. 9 నెలల పాటు నెలకు 5జీబీ చొప్పున ఈ డేటా లభిస్తుంది. అయితే యూజర్లు అందుకు గాను రూ.309 ఆపైన విలువ గల ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ వచ్చే ఏడాది ఆగస్టు 31 వరకు వారికి అందుబాటులో ఉంటుంది.

ఉచిత యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్‌

ఉచిత యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్‌

దీంతోపాటు సర్విఫై అనే సంస్థ ఏడాది పాటు ఈ ఫోన్‌కు ఉచిత యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నది. అయితే అందుకు గాను యూజర్లు రూ.1000 తో కోటక్ 811 సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Nokia 2 with 4100 mAh battery, Google Assistant launched in India More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X